ఏ జ్ఞానమైనా సరే....

21 Apr, 2015 22:36 IST|Sakshi
ఏ జ్ఞానమైనా సరే....

 గ్రంథపు చెక్క

జ్ఞానం సంపాదించడం వల్ల శాంతి చెడదు. సంపాయించిన జ్ఞానాన్ని విశ్వసించి దాన్ని జీవితం మీదికి తెచ్చుకొని ఆ జ్ఞానం ప్రకారం జీవితాన్ని వంకర తిప్పడం వల్ల కలుగుతాయి అనర్థాలు  ఏ జ్ఞానమైనా సరే అది రిలెటివ్. ఓ మూల నుంచి ఓ కోణం నించే అది సత్యం. సంపూర్ణమైన జ్ఞానం ఏదీ కాదు. నీకు సత్యం కనుక అది నాకు సత్యం కానక్కర్లేదు అనే స్తిమితం, విశాలత్వం ఉంది ఈ దేశంలో  త్యాగమనేది త్యాగమని తెలియకుండానే జరగాలి.

తెలిసి జరిగినప్పుడు తనకీ, ఇతరులకీ విషతుల్యం  బోధనలు రెండు విధాలు...తాను నమ్మినది బోధించడం, తాను నమ్మనిది బోధించడం!  ద్వేషం ప్రేమకు చాలా సన్నిహితం. అందుకనే మనం ప్రేమిస్తున్నవాళ్ళు అపరాధం చేసినప్పుడు మనకి ఎక్కువ ద్వేషం కలుగుతుంది  మనుష్యుడు మృగాల కన్న వివేకవంతుడైనందుకు, మృగాల ఆనందాన్ని త్యజించడానికి కాదు ఆ వివేకాన్ని ఉపయోగించాల్సింది.
 - చలం ‘విషాదం’ (ఇతర వ్యాసాలు) పుస్తకం నుంచి.

మరిన్ని వార్తలు