లైఫ్‌ని ఎగ్జయిటింగ్‌గా ఉంచే ఫ్రెండ్స్ ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంది!

4 Aug, 2013 02:15 IST|Sakshi
లైఫ్‌ని ఎగ్జయిటింగ్‌గా ఉంచే ఫ్రెండ్స్ ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంది!

 ఫ్రెండ్‌షిప్ అన్న మాట వినగానే సినిమా పరిశ్రమలో నాకు గుర్తొచ్చే ఫ్రెండ్ తాప్సీ! తక్కువ టైములోనే ఎంతో దగ్గరయ్యింది తను. ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. అన్నీ డిస్కస్ చేసుకుంటాం. సరదాగా గడుపుతాం. తను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అది తనలో నాకు చాలా నచ్చే లక్షణం. కాలేజీ రోజుల్నుంచీ రానా కూడా నాకు మంచి స్నేహితుడే. ఇక, సినిమా పరిశ్రమ కాకుండా విడిగా నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.

ఒకరు రేవతి, రెండోవారు యామిని. నా కాలేజీ రోజుల నుంచీ వీళ్లు నా స్నేహితులు. యేళ్లు గడిచేకొద్దీ మా వయసుతో పాటు, మా స్నేహం కూడా పెరుగుతూ వస్తోంది. మనకంటూ కొందరు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఎంతటి భరోసా ఉంటుందో రేవతి, యామినీలను చూస్తే అర్థమవుతుంది నాకు. ఏ సమస్య వచ్చినా, ఏ టైమ్‌లో అయినా పిలిస్తే పలుకుతారు. వెంటనే నాకోసం పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్‌లో సంస్కృతి అనే స్కూల్ నడుపుతున్నారు.

నాకేదైనా అవసరం అంటే చాలు... పనులన్నీ పక్కన పెట్టి వచ్చేస్తాను. నేను కొత్త ఇంటికి మారితే వచ్చి అన్నీ సర్దేస్తారు. బోర్ కొడుతోందంటే నాతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. నేను ఏ పెళ్లికో వెళ్లాల్సి ఉంటుంది. ఇంటికెళ్లి అన్నీ సర్దుకునే టైమ్ ఉండదు. ఒక్కసారి రేవతికి గానీ, యామినికి గానీ ఫోన్ చేస్తే చాలు... ఇంటికెళ్లి చీర దగ్గర్నుంచి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వరకూ అన్నీ సర్ది నాకందించేస్తారు.  లైఫ్‌ని ప్రతిక్షణం ఎగ్జయిటింగ్‌గా, సంతోషంగా ఉంచే ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అంతకన్నా లైఫ్‌లో  కావాల్సింది ఏముంది!
 

మరిన్ని వార్తలు