-

హాట్ ప్యాక్ ఎప్పుడు...?

27 Jan, 2014 22:51 IST|Sakshi
హాట్ ప్యాక్ ఎప్పుడు...?

సాధారణంగా దీర్ఘకాలికంగా నొప్పి వస్తున్నప్పుడు, నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు, ఆడవాళ్లకు నెలసరి సమయాల్లో నడుము వద్ద నొప్పి వస్తున్నప్పుడు వేడికాపడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ వేడిదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్ రేట్) కూడా పెరుగుతుంది.

నరాలు ఉత్తేజం చెందుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో పట్టే చెమటలో మలినాలు విసర్జితమవుతాయి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ సంయుక్త చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10-15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్ వాటర్ బ్యాగ్‌తోగాని, ఎలక్ట్రిక్ హీట్ ప్యాత్‌గాని, వ్యాక్స్‌తో గాని పెట్టవచ్చు.
 
ఏయే సందర్భాల్లో: సాధారణ నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్ బ్యాక్‌పెయిన్) / డిస్క్ పొలాప్స్ / సయాటికా / బహిష్టు నొప్పి.
 
- డాక్టర్ శివభారత్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్
 ఈషా హాస్పిటల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు