విజయాల వేటలో మీరెక్కడ?

7 Jun, 2017 00:02 IST|Sakshi
విజయాల వేటలో మీరెక్కడ?

సెల్ఫ్‌చెక్‌

విజయం రుచి చూసినవారు దాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. దానికోసం ఎటువంటి కష్టాన్న యినా భరించగలుగుతారు. ఈ స్పృహ ఉన్నవారు నిరంతర శ్రామికులు. లక్ష్యం చేరాక వారు పడిన శ్రమలన్నీ తేలికగా అనిపిస్తాయి. విజయం అవసరంలేదు అనుకొనేవారు సోమరులు. సక్సెస్‌ సాధించాలి అనే కోరిక మనిషిని హుషారుగా ఉంచుతుంది. విజయాలు చేరుకోవాలనే తృష్ణ మీలో ఉందోలేదో ఒకసారి చెక్‌ చేసుకోండి.

1.    సమాజంలో బాగా పేరున్న వారితో పరిచయం పెంచుకోవాలనుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

2.    ఏరోజు పని ఆరోజు పూర్తి చేస్తారు.
ఎ. అవును     బి. కాదు

3.    మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు.
ఎ. అవును     బి. కాదు

4.    అందరిలో ఉన్నతంగా కనిపించాలనే తపన మీకుంది.
ఎ. అవును     బి. కాదు

5.    ప్రతికూల అంశాలనూ మీ బలంగా మార్చుకోగలరు.
ఎ. అవును     బి. కాదు

6.    వివిధ రకాల కళలలో మీకు ప్రవేశం ఉంది.
ఎ. అవును     బి. కాదు

7.    సమాజంతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి.
ఎ. అవును     బి. కాదు

8.    ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలరు.
ఎ. అవును     బి. కాదు

9.    ఎక్కువగా కష్టపడగలరు, స్ఫూర్తి నింపే వారిని ఇష్టపడతారు.
 ఎ. అవును     బి. కాదు

10.    మంచిమాటలు ఎవరు చెప్పినా, వాటిని ఫాలో అవుతారు.
ఎ. అవును     బి. కాదు

‘ఎ’ లు ఏడు దాటితే మీరు విజయాలను సులువుగా చేరుకోగలరు లేదా దానికోసం చివరివరకు ప్రయత్నిస్తారు. ఏ రంగంలోకి వెళ్లినా పట్టుదలను వదులుకోరు. ఓటమిని అంగీకరించే మనస్తత్వం మీకు ఉండదు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే సక్సెస్‌ రేస్‌లో వెనకబడతారు. విజయానికి కావలసింది కష్టపడటం. ‘ఎ’లను సూచనలుగా భావించి, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ నింపుకొని విజయాలబాటలో నడవడానికి ప్రయత్నించండి.

మరిన్ని వార్తలు