బొప్పాయితో గర్భస్రావం అవుతుందా?

24 Oct, 2017 00:06 IST|Sakshi

అపోహ–వాస్తవం

అపోహ: బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది.
వాస్తవం: ఇది చాలామందిలో ఉన్న అపోహ. బాగా పక్వానికి వచ్చిన బొప్పాయి పండును తినడం గర్భవతులకు మేలు చేస్తుంది. ఎందుకంటే... ఇందులో విటమిన్‌–ఏ, విటమిన్‌–సిలతో పాటూ అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. పూర్తిగా పండని లేదా బాగా పచ్చిగా ఉన్నవాటిని తినకూడదు. పచ్చిబొప్పాయిలో ‘పపాయిన్‌’ అనే ఎంజైమ్‌ ఉంటుంది.

ఈ ఎంజైమ్‌ గర్భసంచిని ముడుచుకుపోయేలా (యుటెరైన్‌ కంట్రాక్షన్స్‌ను) ప్రేరేపించి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే పచ్చిది, పాక్షికంగా పండినవాటిని మాత్రం గర్భవతులు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే ఆ పండ్లముక్కలను తేనెతోనూ, పాలతోనూ కలిపి తింటే అందులోని పపాయిన్‌ ఎంజైమ్‌ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. 

మరిన్ని వార్తలు