రాబోయే వింటర్‌కి ఓ కొత్త స్వెటర్...

20 Oct, 2016 22:44 IST|Sakshi
రాబోయే వింటర్‌కి ఓ కొత్త స్వెటర్...

 న్యూలుక్

చలికాలం రాబోతోంది. ఎక్కడో షెల్ఫ్‌లో అడుగున చేరిన స్వెటర్స్, స్వెట్ షర్ట్స్‌ను శుభ్రపరచాలని బయటకు తీసుంటారు. కిందటేడాది వేసుకున్నవాటిని ఇప్పుడూ ధరించాలంటే బోర్‌గా ఉంటుంది. స్వెటర్స్‌కి, స్వెట్ షర్ట్స్‌కి ఓ కొత్త లుక్ తీసుకురావాలంటే.. ఇదో మంచి ఎంపిక. ట్రై చేయండి. ముందుగా స్వెట్ షర్ట్, స్వెటర్‌కి ఉన్న లోపాలను సవరించాలి. తర్వాత రంగు వెలిసిపోవడం, ఎంత తొలగించాలి అనేవి చాక్‌స్టిక్‌తో మార్క్ చేసుకోవాలి. ఇది కూడా ఒక డిజైన్‌లాగా ఉండాలి. అప్పుడు ఎంపిక చేసుకున్న క్లాత్‌ని జత చేయడం సులువు అవుతుంది.ప్లెయిన్ స్వెట్‌షర్ట్‌కి ప్రింటెడ్ క్లాత్‌ను తీసుకొని నెక్ నుంచి నడుము వరకు నిలువు పట్టీ వేయచ్చు. అలాగే జేబు భాగం, ముంజేతుల వద్ద క్లాత్‌ను జత చేసి కుట్టాలి. గౌను అయితే బ్లౌజ్ భాగం వరకు సెటర్ వచ్చేలా కట్ చేసుకొని కుట్టాలి. కుచ్చులను వేరే కాంబినేషన్ క్లాత్ తీసుకొని కుట్టాలి. ఈ రెండింటినీ జత చేయాలి.

     
స్వెట్ షర్ట్‌కి లేసు డి జైన్స్‌ను జత చేస్తే మరో కొత్త డిజైనర్ స్వెటర్ మీ ముందు రెడీ.స్వెట్ షర్ట్‌ను ముందు భాగంలో కత్తిరించి నెక్ భాగం అంతా మరో ప్రింటెడ్ క్లాత్ జత చేస్తే ఓవర్‌కోట్‌ని తలపించే డ్రెస్ రెడీ.స్వెటర్‌కి పూర్తి కాంట్రాస్ట్ కలర్ దారాలను ఎంచుకొని డిజైన్ మార్క్ చేసుకొని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలి.. ఇలా అందమైన స్వెటర్ ఓ కొత్త లుక్‌తో ఆకట్టుకుంటుంది.పాత స్వెటర్‌ని మఫ్లర్, సాక్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, బ్యాగ్‌గా కూడా మార్చుకోవచ్చు.

మరిన్ని వార్తలు