కార్లలో వైర్‌లెస్‌  సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌

30 Jan, 2018 00:36 IST|Sakshi
పవర్‌స్క్వేర్‌

కార్లు, బస్సుల్లో వైర్‌లెస్‌ పద్ధతిలో స్మార్ట్‌ ఫోన్లను ఛార్జ్‌ చేసుకునేందుకు భారతీయ కంపెనీ ఒక వినూత్నమైన ఆవిష్కరణ చేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్‌స్క్వేర్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరికరంలో ఫోన్‌ను ఉంచితే చాలు,  వైర్‌లెస్‌ పద్ధతిలో దాని బ్యాటరీ ఛార్జ్‌ అవుతూంటుంది. కనెక్టర్లు, అడాప్టర్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేదన్నమాట. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు అనుకూలించే ఏ బ్రాండ్‌ ఫోన్‌నైనా దీంట్లో వినియోగించవచ్చు. డాష్‌ బోర్డుతోపాటు సెంట్రల్‌ కన్సోల్‌; ఆర్మ్‌రెస్ట్‌లలో ఎక్కడైనా బిగించుకునేందుకు ఇది అనువైందని అంటున్నారు కంపెనీ సీఈవో పూడిపెద్ది పవన్‌.

ఛార్జింగ్‌ కోసం ఉంచిన స్మార్ట్‌ఫోన్‌కు ఏ స్థాయి విద్యుత్తు అవసరమన్నది కూడా ఈ పరికరమే గుర్తిస్తుందని చెప్పారు. సామ్‌సంగ్, ఆపిల్‌ ఐఫోన్లలోని కొన్ని మోడళ్లలో ఉండే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మోడ్‌ను కూడా పసిగట్టి తనంతట తానే 7.5  లేదంటే పదివాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుందని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీని విద్యుత్తు వాహనాలతో పాటు మిక్సీ, గ్రైండర్, టోస్టర్‌ వంటి వంటింటి పరికరాలకూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కాట్రగడ్డ ఆనంద్‌ తెలిపారు.  

>
మరిన్ని వార్తలు