పెళ్లితో స్త్రీకి  యుగాంతం ఏమీ వచ్చేయదు

16 Apr, 2018 00:13 IST|Sakshi

మంచి మాట

‘‘పెళ్లితో అమ్మాయి జీవితం ఆగిపోదు. మొదలవుతుంది. భర్త, ఇల్లు, పిల్లలతోపాటు ఆమెకూ వ్యక్తిగత ప్రయాణం ఉంటుంది. ఆశలు, ఆశయాలతో ఆ లక్ష్యం వైపు పరిగెత్తాలనుకుంటుంది. ఆమె కలల రెక్కలనూ స్వాగతించే అత్తింటి వారుండాలి. ఆమెను ఆమెగా స్వీకరించాలి. ఆమె ‘మల్టీటాస్క్‌’కు సహకారం అందించాలి. ఆమెకంటూ ఉన్న లక్ష్యసాధనకు మద్దతు ఇవ్వాలి. పెళ్లికి ముందు తల్లిదండ్రులు, అన్నదమ్ముల నుంచి, పెళ్లయిన తర్వాత అత్తమామలు, భర్త నుంచీ ఇలాంటి సహాయసహకారాలుండాలి. అన్నిటినీ సంభాళించగల సామర్థ్యం స్త్రీకి సహజంగానే ఉంటుంది.

ఇంటి బాధ్యతల్లో పడిపోయినప్పుడు భర్త ఆమెను ప్రోత్సహించాలి. ‘‘ఈ పనులు సగం నేను చేసి పెడతాను.. నీకు మాత్రమే సొంతమైన టాలెంట్‌ మీద దృష్టి పెట్టు’’ అని భుజం తట్టాలి. అమ్మాయిలు కూడా పెళ్లి కోసం వాళ్ల ఆశయాలను సర్దుబాటు చేసుకోనక్కర్లేదు. అర్థం చేసుకునే ఇంట్లో అడుగుపెట్టడానికి వెయిట్‌ చేయాలి. జీవితంలో పెళ్లి ఒక భాగం. అదే జీవితం కాదు. పెళ్లి, పిల్లలతో స్థిరపడటం స్త్రీలకు ఎంత అవసరమో పురుషులకూ అంతే. ఇద్దరికీ అంతే ఇంపార్టెంట్‌. కాబట్టి సర్దుబాటు కన్నా సహకారం కోసం చూడాలి. అలాగే తల్లులు కూడా తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే సమాన హక్కుల గురించి చెప్పాలి. నేర్పాలి. పెళ్లితో అమ్మాయికి అబ్బాయి ఒక భరోసా ఇచ్చేట్టు పెంచాలి తప్ప పెత్తనం పొందేట్టు కాదు.’’

(ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్, యూనిసెఫ్‌ అంబాసిడర్‌ ప్రియాంక చోప్రా.  ఇటీవల ఇండియా వచ్చినప్పుడు ఢిల్లీలో ఇచ్చిన యూనిసెఫ్‌ ప్రసంగంలోంచి చిన్న భాగం). 

మరిన్ని వార్తలు