చుట్టూ పని మధ్యలో తను

27 Apr, 2019 00:04 IST|Sakshi

వర్కింగ్‌ హ్యూమన్‌

ఉద్యోగం చేస్తుండే స్త్రీ.. రెండు చేతుల్తో సునాయాసంగా ఇంటి పనీ, ఆఫీస్‌ పనీ చక్కబెట్టేయగల సర్వశక్తి సంపన్నరాలని సమాజానికి గొప్ప నమ్మకం. ఆ నమ్మకంతోనే ఏమీ తోచనప్పుడల్లా వర్కింగ్‌ ఉమన్‌కి సలహాలు ఇస్తుంటుంది. అలా చేస్తే కుటుంబం కళకళలాడుతూ ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటుందని ఆశపెడుతుంది. ఉద్యోగిని ‘ఎదుర్కొనే’ కొన్ని సలహాలు ఎలా ఉంటాయో చూడండి.

►ఇంటిని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచండి. భర్త, పిల్లల బర్త్‌డేలను చక్కగా ప్లాన్‌ చెయ్యండి. ఫన్‌గా ఉండండి. అదే సమయంలో ఫర్మ్‌గానూ (గట్టిగా) ఉండండి.

►పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని మరువకండి. ఇందుకోసం మీల్‌ ప్లానర్‌ ఒకటి తయారు చేసుకోండి.

►బిడ్డను కన్న తర్వాత పెరిగిన బరువును వీలైనంత త్వరగా తగ్గించుకుని మునుపటి షేప్‌కి వచ్చేయండి.

►ఏడు రోజులూ పనిచేసుకుంటూ పోతున్నా కూడా మీరు కనుక బాగా గమనిస్తే  గంటో, రెండు గంటలో మిగిలే ఛాన్స్‌ ఉంటుంది. వాటిని మీకోసం కేటాయించుకోండి.ఇవండీ! ఆ సలహాలు, సూచనలు. ఎంత దారుణం, ఎంత అమానుషం! వీటిల్లో ఏ ఒక్కటైనా చెయ్యడానికి ఉద్యోగిని వెనకంజవెయ్యదు కానీ, ముందడుగు వెయ్యడానికి ఆ వేసే చోట ఖాళీగా ఉండాలి కదా. చుట్టూ పని. మధ్యలో తను. ‘అయ్యిందా’ అని అడిగేవాళ్లే కానీ, హెల్ప్‌ చేసేవాళ్లుండరు. ‘ఇలా ఉందేమిటి?’ అనేవాళ్లు కానీ, ‘ఒంట్లో ఎలా ఉంది?’ అని కనిపెట్టి అడిగేవాళ్లుండరు. అయినప్పటికీ ఆమె ఇంటిని, ఒంటిని చక్కబెట్టుకుని తను వెలిగిపోతూ, ఇంటిని వెలిగిస్తూ ఉండాల్సిందే.

అలా ఉంటే.. ఆమె స్త్రీ శక్తి. ఉత్తమ ఇల్లాలు. చురుగ్గా, వేగంగా పనుల్ని చక్కబెట్టే నిపుణురాలు! ఎన్నాళ్లిలా ఆమెను పొగుడుతూ, ప్రశంసిస్తూ, క్షణం తీరిక ఇవ్వకుండా ఆమెను యంత్రంలా వాడుకుంటాం. తనూ మనిషే కదా. ఇదే ప్రశ్న అడుగుతూ.. శారా అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో చిన్న పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌లో.. ముఖ్యంగా బిడ్డ తల్లులకు సమాజం వైపు నుంచి ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయో, ఎంత శ్రేయోభిలాషకు ఆ తల్లులు ‘గురవుతారో’ తన అనుభవాలను జోడిస్తూ షేర్‌ చేసుకున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?