శాంతిపావురాలు!

8 Mar, 2017 01:18 IST|Sakshi
శాంతిపావురాలు!

చరిత్రలో చూసినా మహిళలు ఎల్లప్పుడూ శాంతికారక శక్తిగానే ఉన్నారు. సంప్రదాయ యుద్ధం అనేది పురుషుల క్రీడ. ఆదిమ సమాజంలో సైతం పొరుగూరిపై దాడి చేయడానికి మహిళలు సంఘటితమై వెళ్లిన ఉదంతాలు లేవు. మహిళలు తల్లులుగా... తమ పిల్లలు ఎదగడానికి వీలైన శాంతియుత పరిస్థితులు నెలకొనడానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే... అధికారం ఎక్కువగా లేకపోవడం వల్లే మహిళలు హింసకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, మార్గరెట్‌థాచర్, ఇందిరాగాంధీ వంటి మహిళలు అధికారంలోకి వచ్చిన తర్వాత... అప్పటి పరిస్థితులను బట్టి దేశాన్ని యుద్ధాల్లోకే నడిపించారని విమర్శించే వాళ్లూ ఉన్నారు.

కానీ, వారు ‘పురుషాధిక్య ప్రపంచం’లోని రాజకీయ నియమాలను పాటించడం ద్వారానే వచ్చారని... అందుకే ఆ రాజకీయాలకు అనుగుణంగా నడుచుకున్నారని... మహిళలకు అధికారంలో సరైన దామాషాలో (సగం) వాటా ఉంటే అధికారంలో ఉన్నా వారు భిన్నంగా స్పందించి ఉండొచ్చునని హార్వర్డ్‌ యూనివర్సిటీ సైకాలజిస్ట్‌ స్టీవెన్‌ పింకర్‌ విశ్లేషిస్తున్నారు.

ఆకాశంలో సగం.. మరి అధికారంలో?
(లెక్క..శాతాలలో)

►1 పపంచ దేశాలన్నిటిలో 20వ శతాబ్దంలో పురుష పాలకుల భార్యలు లేదా కూతుళ్లుగా కాకుండా తమంత తాముగా పాలకులుగా ఎదిగిన మహిళలు. (ఒక్క శాతం కన్నా తక్కువే.)

►22.8 ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జాతీయ స్థాయి చట్టసభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యం.

►61.3 రువాండా దిగువసభలో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో ఇదే అత్యధికం.

►53.1 బొలీవియా పార్లమెంటులో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో రెండో స్థానం.

►48.9 క్యూబా పార్లమెంటు లో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో మూడో స్థానం.

►19.1 అమెరికా ప్రతినిధుల సభలో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో 104వ స్థానం.

►38 పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న దేశాలు.

►16 ప్రస్తుతం ప్రపంచంలో మహిళలు దేశాధ్యక్షులుగా లేదా ప్రధానమంత్రులుగా ఉన్న దేశాలు.

►4 పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యమే లేని దేశాలు.

►11.8 భారత లోక్‌సభలో మహిళా ప్రజాప్రతినిధులు. ప్రపంచంలో 148వ స్థానం.

► 9 భారతదేశంలోని రాష్ట్రాల శాసనసభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యం.

మరిన్ని వార్తలు