క్లెయిన్‌ కట్‌

1 Jun, 2017 23:10 IST|Sakshi

ఫ్యాషన్‌ ఫ్యూజన్‌
ప్రపంచ ఫ్యాషన్‌ పరిచయం


ఎక్కడైనా... ఎప్పుడైనా! ఎనీవేర్‌... ఎనీటైమ్‌!! కాల్విన్‌ క్లెయిన్‌ డిజైన్‌ చేసిన డ్రెస్సులు ఏ సందర్భానికైనా సూపర్‌గా సూటవుతాయి. అంత గొప్పగా ఉంటాయంటే దానికి కారణం... కట్‌ అంత క్లీన్‌గా ఉంటుందని! అందుకే క్లెయిన్‌ కట్‌ ప్రపంచంలో ఎంతో మంది డిజైన్లని కట్‌ చేసి పారేసింది.


అతని డిజైనరీ దుస్తులు యవ్వనానికి కొత్త ఉత్సాహాన్ని అద్దుతాయి. సౌకర్యంలో సరికావు ఏ డిజైన్సూ అనిపిస్తాయి. విలాసవంతుల వార్డ్‌రోబ్‌లో ఎనీవేర్‌ ఎనీటైమ్‌ అంటూ హŸయలు పోతుంటాయి. ఈ బ్రాండెడ్‌ దుస్తుల రూపకర్త పేరు కాల్విన్‌ క్లెయిన్‌. అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగిన క్లెయిన్‌ ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా ప్రపంచంలో ఏ మూలనైనా తన బ్రాండెడ్‌ దుస్తులతో బాజా మోగిస్తుంటాడు.  
ఏడు పదుల వయసు దాటిన ఈ కంఫర్ట్‌ కింగ్‌ హైస్కూల్‌ స్థాయిలోనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మెలకువలు తెలుసుకొని ఆ తర్వాత దీంట్లోనే డిగ్రీ పట్టా పొందాడు. ‘కాల్విన్‌ క్లెయిన్‌ ఇంక్‌’ పేరుతో న్యూయార్క్‌లో 1968లో తన బాల్యమిత్రుడితో కలిసి కంపెనీ ప్రారంభించాడు. అప్పట్లో ముందుగా పెర్‌ఫ్యూమ్స్, గడియారాలు, ఫ్యాషన్‌ ఆభరణాలు తయారుచేసేవాడట. తర్వాత్తర్వాత దుస్తుల మీదా తన మార్క్‌ కత్తెరను వేశాడు.

జీన్స్‌ లైన్‌
ఎంతటి ఘనమైన డిజైన్స్‌కైనా నలుగురి దృష్టీ పడాలంటే వేదిక ఫ్యాషన్‌ షోయే! క్లెయిన్‌ కట్స్‌కి న్యూయార్క్‌ ఎలైట్‌ ఫ్యాషన్‌ షో రెడ్‌కార్పెట్‌ పరిచింది. మొదటిసారి తనదైన ‘జీన్స్‌ లై¯Œ ’ని లాంచ్‌ చేశాడు క్లెయిన్‌. అంతే, అప్పటి వరకు జీన్స్‌లో అగ్రగామిగా ఉండే సంస్థలన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ‘ఏంటీ కట్‌’ అంటూ విస్తుపోయాయి. అతివలు ‘స్టైలిష్, కంఫర్ట్‌’ అంటూ క్లెయిన్‌ జీన్స్‌ కట్‌కి కితాబులిచ్చేశారు. దీంతో ప్రతియేటా ఫ్యాషన్‌ ఇండస్ట్రీ న్యూయార్క్‌ సిటీ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించింది. జీన్స్‌ నుంచి మిడ్‌ ఫ్రాక్స్, లాంగ్‌ ఫ్రాక్స్, అండర్‌వేర్స్‌... ఇది అది అని తేడా లేకుండా అమ్మాయిల లుక్స్‌ అదిరిపోయేలా డ్రెస్‌ డిజైన్స్‌ ఎన్నో సృష్టించి ‘వహ్‌వా!’ అనిపించాడు. పదేళ్లలోనే అంతర్జాతీయ బెస్ట్‌ డ్రెస్డ్‌ జాబితాలో నిలిచాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎంతో మంది కలలు కనే అమెరికా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కౌన్సిల్‌ ఇచ్చే అవార్డును 1983లో అందుకున్నాడు.

హాలీవుడ్‌ టు టాలీవుడ్‌
మోడల్స్, సెలబ్రిటీస్‌ ధరించే లేడీస్, మెన్స్‌ వేర్‌లో క్లెయిన్‌ డెనిమ్, అండర్‌వేర్‌ గార్మెంట్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. హాలీవుడ్‌ నటి ఏంజిలినా జోలీ, జెన్నిఫర్‌ లారెన్స్, డయాన్‌ కృగరే... వంటి నటీమణులతో పాటు రాజకీయ ప్రముఖులూ క్లెయిన్‌ డ్రెస్సులో మెరిసేవారే. అమెరికా ప్రెసిడెంట్‌ భార్య మెలానియా ట్రంప్‌ ఇటీవల జర్మనీలో క్లెయిన్‌ డ్రెస్‌ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అమెరికన్‌ టెలివిజన్‌లోని అన్ని ఫేమస్‌ సీరీస్‌లలోనూ క్లెయిన్‌ డ్రెస్‌లే ప్రముఖంగా నిలుస్తున్నాయి. మన దగ్గర బాలీవుడ్‌ నటీమణులు సైతం కంఫర్ట్, స్టైల్‌ క్లెయిన్‌ డ్రెస్‌తోనే సాధ్యం అంటారు. వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడిన చిన్న చిన్న కమ్యూనిటీల డ్రెస్సింగ్‌ మూలాలను పట్టుకుంటారు క్లెయిన్‌. వాటినే సింపుల్‌గా తన కట్స్‌ ద్వారా పరిచయం చేస్తారు.

క్లెయిన్‌ జీన్స్‌
క్లెయిన్‌ జీన్స్‌లో బూట్‌ లెగ్‌ స్టైల్‌ ఉంటుంది. దీంతో ఇది క్యాజువల్‌ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ ఏ సమయంలోనైనా ధరించే వీలుంటుంది. సౌకర్యంతో పాటు గ్లామరస్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేయడంతో  ప్రపంచ మహిళ తన వార్డ్‌రోబ్‌లో క్లెయిన్‌ జీన్స్‌ తప్పక ఉండాలనుకుంటుంది. హాలీవుడ్‌తో పాటు మన బాలీవుడ్, టాలీవుడ్‌ తారలు, ఇతర ప్రాంతీయ సినిమా సెలబ్రిటీలూ క్లెయిన్‌ జీన్స్‌కి ఓటేస్తుంటారు.

ప్రింటెడ్‌ డ్రెస్‌
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్‌ షోలో ప్రింటెడ్‌ డ్రెస్సులను విడుదల చేశాడు క్లెయిన్‌. తేలికగా ఉండే ఫ్యాబ్రిక్, ఫ్లాట్‌ కట్‌తో ఉండే ఈ డిజైనరీ డ్రెస్సులకు ఫ్యాషన్‌ వరల్డ్‌ వార్మ్‌వెల్‌కమ్‌ చెప్పింది. టాప్‌ టు బాటమ్‌ ఒకేలా ఉండే ప్రింటెడ్‌ మినీ గౌన్లు కలర్‌ఫుల్‌గా ఉంటే, టాప్స్, బ్లౌజ్‌లు ఫన్‌ని సృష్టిస్తాయి. దీంతో ముఖ్యంగా ఈ డిజైన్స్‌ యువతను ఆకర్షిస్తున్నాయి. చేతితో కుట్టిన ఎంబ్రాయిరీ, ఇతర అంశాలూ ఈ బ్లౌజ్‌లలో కనిపిస్తాయి.

లో దుస్తుల హవా!
జీన్స్, షర్ట్స్, గౌన్స్, బ్లేజర్స్‌తో పాటు క్లెయిన్‌ లోదుస్తులు ఫ్యాషన్‌ ప్రపంచానికి సుపరిచితమే. సరైన దృష్టి పెడితే ఈ వరల్డ్‌ క్లాస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ క్లెయిన్‌ డ్రెస్‌ డిజైన్‌ స్టైల్‌ని మనమూ పట్టుకోవచ్చు.

ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన మిడ్‌ ఫ్రాక్‌ ఇది. భుజం నుంచి వంపు భాగం తీసుకొని, దానికి ఫ్రిల్స్‌ జత చేయడంతో ఫ్రాక్‌ లుక్‌ మారింది.

అమెరికన్‌ స్టైల్‌కి ఇండియన్‌ ధోతీ కట్‌. భారతీయ డ్రెస్సింగ్‌ మూలాలను పట్టుకుని, రూపొందిం చిన న్యూ స్టైల్‌.

హాలీవుడ్‌– బాలీవుడ్‌– టాలీవుడ్‌.. సరిహద్దుల్లేని క్లెయిన్‌ స్టైల్‌ జీన్స్, సింపుల్‌ టాప్‌ ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌! తారల అభిమాన బ్రాండ్‌!

స్ట్రైప్స్‌ మ్యాక్సీ డ్రెస్‌ ఇది. వెస్ట్రన్‌ పార్టీలకు సరైన ఎంపిక. క్యాజువల్‌ వేర్‌గానూ టీనేజర్స్‌ కోరుకునే డ్రెస్‌.

మల్టీకలర్స్, ఫ్లోయింగ్‌ కట్‌ క్లెయిమ్‌ మ్యాక్సీ డ్రెస్‌కు వన్నె తెచ్చాయి. రేయాన్‌ బెల్ట్‌ అట్రాక్షన్‌ని పెంచింది.

క్ లెయిన్‌ సృష్టి రెడ్‌ కార్పెట్‌ పై హŸయలు పోతుంది. గ్రీన్‌ కలర్‌ లేస్, రత్నాలు పొదిగిన లాంగ్‌ ప్రోమ్‌ డ్రెస్‌ ఇది. ఒకే రంగు ఫ్యాబ్రిక్‌తో చేసే ఇలాంటి మ్యాజిక్‌లెన్నో క్లెయిమ్‌ ఖాతాలో ఉన్నాయి.

తేలికైన ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌తో క్లెయిన్‌ మ్యాజిక్‌ చేస్తాడు. అవి ఏ కాలానికైనా నప్పుతాయి.

క్లెయిన్‌ ప్యాడెడ్‌ స్లీవ్‌లెస్‌ జాకెట్‌ స్టైల్‌ అమ్మాయిల రఫ్‌ అండ్‌ టఫ్‌ డేరింగ్‌ లుక్‌ని కళ్లకు కడుతుంది.

క్యాజువల్‌ డ్రెస్సింగ్‌లో కంఫర్ట్‌ లుక్‌. డెనిమ్‌ జీన్స్, పింక్‌ స్లీవ్‌లెస్‌ టీ షర్ట్‌. నేటితరం కంఫర్ట్, స్టైల్‌  ఐకాన్‌.

రెడీ టు వేర్‌!
కాల్విన్‌ క్లెయిన్‌ డిజైన్స్‌లో అమెరికన్‌ స్టైల్‌ కనిపించినా ప్రపంచంలోని హాట్, యంగ్‌ బాడీస్‌కి నప్పేలా డిజైనింగ్‌ ఉండటం విశేషం. క్లెయిన్‌ డిజైన్స్‌ మార్కెట్లోకి రావడంతోనే ఎన్నో వేల కంపెనీ లు వెనకడుగువేశాయి. ‘సాహో..’ అంటూ క్లెయిన్‌ బ్రాండ్‌కు సాగిలపడ్డాయి. ప్లెయిన్‌ డ్రెస్‌లోనే సింపుల్‌ కట్‌తో ఒక క్లాసిక్‌ టచ్‌ని, మోడ్రన్‌ ఫిట్‌ని తీసుకువస్తారు క్లెయిన్‌. అందుకే, ఏ కాలమైనా, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా క్లెయిన్‌ డ్రెస్సులు ‘రెడీ టువేర్‌’ అన్నట్టుగా ఉంటాయి.
నిర్వహణ: ఎన్‌.ఆర్‌

మరిన్ని వార్తలు