పరివృత జానుశిరాసనం

13 Aug, 2013 04:51 IST|Sakshi
పరివృత జానుశిరాసనం

నిర్వచనం: ‘తిప్పబడిన లేదా మెలివేయబడిన జానుశిరాసనం అని అర్థం. ఈ ఆసనంలో ముఖాన్ని పక్కకు తిప్పి చూడాలి.
 
చేసే విధానం

రెండుకాళ్లను చాపి వెన్నెముక నిటారుగా ఉంచుకుని సమస్థితిలో కూర్చోవాలి. తర్వాత ఎడమకాలిని మోకాలి వద్ద మడిచి ఎడమ పాదాన్ని కుడికాలి తొడ దిగువ భాగాన ఆనించాలి.
   
 కుడిచేత్తో కుడికాలి వేళ్లను పట్టుకోవాలి, ఎడమ చేతిని నిటారుగా గాల్లోకి పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో ఎడమ చేయి చెవిని తాకుతుండాలి. శరీరాన్ని, తలను కొద్దిగా ఎడమవైపుకి తిప్పాలి.
 
 ఇప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకుని శరీరాన్ని పైకి సాగదీసినట్లు లాగి, శ్వాస వదులుతూ కుడివైపుకి వంగాలి. ఈ స్థితిలో కుడి మోచేయి నేలను తాకాలి. ఎడమ చేతితో కుడికాలి వేళ్లను పట్టుకోవాలి.
 
 ఈ స్థితిలో శ్వాసను వదిలి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
 
 ఇలాగే కుడికాలిని మడిచి  కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదు సార్లు చేయాలి.
 
 ఫొటోలు: శివ మల్లాల
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్

 

మరిన్ని వార్తలు