గుండెకు ‘ప్రాణం'

28 Sep, 2016 23:59 IST|Sakshi

గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి, హృద్రోగ సమస్యలు పరిష్కరించడానికి ప్రాణాయామము, యోగాసనాలు, ధ్యానసాధన అత్యుత్తమ మార్గం. అయితే  గుండె శక్తివంతంగా మారాలని చేస్తున్నామా? గుండె సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చేస్తున్నామా? అనేది గమనించాలి. తదనుగుణంగా సాధన ఎంచుకోవాలి. సాధన చేసే పద్ధతి మీడియం నుంచి స్పీడ్‌గా ఉంటే...దానిని శక్తి క్రమ అంటారు.

అదే నిదానంగా శ్వాసకు అనుగుణంగా చేసే సాధన చికిత్సా క్రమ పద్ధతి అంటారు.  నిలబడి చేసే ఆసనాలన్నీ కూడా వెన్నెముకను సాగదీయడానికి, రిలాక్స్ చేయడానికే. నడుం పైభాగాన ఉండే  సోవాస్ మజిల్స్ రిలాక్స్ కావడం వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా నిలబడి చేసే యోగాసనాల్లో వృక్షాసనం, ఉత్కటాసనం, త్రికోణాసనం,, వీరభధ్రాసనం... వంటివి గుండె పనితీరును మెరుగు పరిచేందుకు ఉపకరిస్తాయి.

 మరిన్ని ఉపయుక్తమైన ఆసనాల్లో...
అధోముఖ శ్వానాసనం, చతురంగ దండాసనం, భుజంగాసనం, పర్వతాసనం, పాదహస్తాసనం... వంటి వాటి వల్ల దిగువ అబ్డామిన్ ఆబ్లిక్ మజిల్ చురుకుగా మారి,  తద్వారా గుండె కండరాలు  శక్తివంతం అవుతాయి. బాలాసనం, నిరాలంబాసనం, సేతు బంధాసనం వల్ల  లోయర్ అబ్డామిన్, ఆబ్లిక్ మజిల్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తేలికపాటి ప్రాణయామాలు ఎక్కువ సేపు ధ్యానం చేయడం గుండెకు ఆరోగ్యం. సూక్ష్మ ప్రాణయామాలైన సూర్యవేది, చంద్రవేది అనులోమ విలోమ ప్రాణయామాలు, అంగన్యాస, అధంగన్యాస, అరణ్యాస వంటి విభాగ ప్రాణయామాలు (సెక్షనల్ బ్రీతింగ్ టెక్నిక్స్) చేయడం ద్వారా గుండె సమస్యలున్నవారికి రిలీఫ్ కలుగుంది. హార్ట్‌రేట్  క్రమబద్ధీకరిస్తాయి.
(సేకరణ : సత్యబాబు)

మరిన్ని వార్తలు