బైపాస్ జరిగినా ఏం పర్లేదు!

4 Nov, 2015 13:41 IST|Sakshi
బైపాస్ జరిగినా ఏం పర్లేదు!

ప్రైవేట్ కౌన్సెలింగ్
 
 నా వయుసు 65 ఏళ్లు. నాకు ఆర్నెల్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. నేను సెక్స్‌లో పాల్గొనడం గాని, హస్త ప్రయోగం చేసుకోవడం గాని చేయవచ్చా?  - ఎన్.కె., ఆదోని


 సాధారణంగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత గుండె పనిచేసే తీరు మెరుగవుతుంది. సర్జరీ తర్వాత మీరు రోజూ రెండు మూడు కిలోమీటర్లు వేగంగా నడవగలిగినా, రెండు మూడు అంతస్తులు ఎక్కగలిగినా... ఆ శారీరక దృఢత్వంతో సెక్స్ చేయడానికి సరిపోతుంది. మీ కార్డియలజిస్ట్‌ను సంప్రదించి సెక్స్ చేయడానికి గుండె పనితీరు సామర్థ్యం సరిపోతుందో లేదో ఒకసారి కనుక్కోండి. సాధారణంగా చాలామందిలో బైపాస్ సర్జరీ తర్వాత సెక్స్‌లో పాల్గొనడానికి ఎలాంటి అభ్యంతరాలు, అవాంతరాలు ఉండవు. సెక్స్, హస్తప్రయోగం ప్రక్రియ రెండూ ఒకలాంటివే. మీ కార్డియాలజిస్ట్ సూచన తీసుకున్న తర్వాత మీరు ఏ ప్రక్రియనైనా నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు.
   
 నా వయుస్సు 59 ఏళ్లు. పదేళ్ల కిందట పక్షవాతం వచ్చింది. మనుపు లేకపోయినా గత కొంతకాలంగా నాకు సెక్స్ కోరికలు కలుగుతున్నారుు. నేను నా భార్యతో సెక్స్‌లో పాల్గొనవచ్చా? పక్షవాతం వచ్చిన వారు సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? నాకు సరైన సలహా ఇవ్వండి.  - ఎన్.ఆర్.కె., రామచంద్రాపురం


 మీలో సెక్స్ కోరికలు కలుతున్నాయంటే మీ నరాలు క్రమంగా చక్కబడుతున్నాయని అర్థం. పక్షవాతం వచ్చిన పేషంట్లలో మొదట్లో సెక్స్ కోరికలు తగ్గడానికి ప్రధానమైన కారణాలు... వూనసికంగా కుంగిపోవడం, నరాలు కాస్త బలహీనంగా ఉండటమే. మీరు పక్షవాతం పరిస్థితి నుంచి మెరుగువుతున్న కొద్దీ ఈ నరాల బలహీనత కూడా క్రవుంగా తగ్గుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు సెక్స్ కోరికలు ఉండి, అంగస్తంభన బాగానే ఉంటే మీరు సెక్స్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే మీ పరిస్థితి వురింత మెరగవుతుందని చెప్పడానికి ఇది ఒక వుంచి సూచన కూడా. కాబట్టి పక్షవాతం వచ్చినా వాళ్లైనా సరే సెక్స్‌లో పాల్గొనగలిగే స్థితిలో ఉంటే నిరభ్యంతరంగా సెక్స్‌ను కొనసాగించవచ్చు.
   
 నా వయుసు 26 ఏళ్లు. నాకు పురుషాంగం కింద, వృషణాల మీద చిన్న చిన్న మొటివుల్లాంటివి వచ్చారుు. వీడీఆర్‌ఎల్, హెచ్‌ఐవీ పరీక్షలు చేరుుంచాను. నాన్ రియూక్టివ్ అని వచ్చింది. అరుుతే అంగం కింద, వృషణాలపైన ఉన్న చిన్న మొటివులు తగ్గలేదు. నా సవుస్యకు చికిత్స ఉందా?  - సీహెచ్.పి.వి., వరంగల్


 పురుషాంగం కిందనున్న చర్మం వెనకభాగంలో ఇలా మొటివుల్లా రావడం అన్నది చాలా సాధారణ సమస్య. ముఖం మీద వచ్చే మొటిమల్లాగానే ఇవి వస్తుంటాయి. అయితే ఇవి ముఖం మీద వచ్చే మొటివుల కంటే కొంత పెద్ద సైజ్‌లో ఉండవచ్చు. సాధారణంగా దురద, వుంట, నొప్పి వంటి లక్షణాలు కనిపించకపోతే దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. వాటంతట అవే తగ్గుతారుు. ఒకవేళ నొప్పి, దురద, మంట ఉంటే యాంటిబయూటిక్స్, లోకల్‌గా క్రీమ్ రాయడం వల్ల ఇవి తగ్గుతారుు. మీరు  యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
   
 నా వయుస్సు 39 ఏళ్లు. నాకు వివాహం జరిగి 15 ఏళ్లు. వూకింకా సంతానం లేదు. నాకు గత నాలుగేళ్లుగా వీర్యంలో ‘ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్’ ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. మందులు వాడుతున్నంత కాలం ఈ పస్ సెల్స్ తగ్గినా... మళ్లీ మందులు మానేయగానే పెరుగుతున్నాయి. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందా?  - డి.ఆర్.ఎల్., విజయవాడ


 పిల్లలు పుట్టనివాళ్లలో పురుషులకు మొట్టమొదట సెమన్ అనాలసిస్ (వీర్యం) పరీక్ష చేస్తారు. దీనిలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. ఒకవేళ వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఫలితంగా వీర్యం నాణ్యత (సెమెన్ క్వాలిటీ) తగ్గి, పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ టాబ్లెట్లు కూడా వాడాల్సి ఉంటుంది. యాంటిబయూటిక్స్ మొదలుపెట్టిన మూడు వారాల తర్వాత మళ్లీ సెమెన్ అనాలిసిస్‌లో వీర్యం క్వాలిటీ సాధారణంగా ఉంటే అప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగవుతారుు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
   
 నాకు 25 ఏళ్లు. పార్ట్‌నర్‌తో సెక్స్‌లో కలిసినప్పుడల్లా మూత్రంలో విపరీతమైన వుంట వస్తోంది. మూత్రనాళం విపరీతంగా లాగడం, మలద్వారంలోనూ నొప్పి, శరీరవుంతా నీరసంగా అనిపించడం జరుగతున్నారుు. ఈ నొప్పి సెక్స్ తర్వాత ఒక గంట వరకూ ఉంటోంది. దాంతో నాకు సెక్స్ అంటేనే భయుంవేస్తోంది. ఒక్కోసారి మూత్రం కూడా ఎర్రగా వస్తోంది. నేను రోజూ రెండుమూడుసార్లు సెక్స్ చేస్తుంటాను. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.  - ఎస్.వై.ఎస్., నల్గొండ


 సెక్స్ చేసిన తర్వాత మూత్రనాళంలో కొంత ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించడం చాలా సాధారణం. అలాంటప్పుడు కొన్ని సార్లు మూత్రం మంటగా రావచ్చు. కాని ప్రతిసారీ ఇలాగే నొప్పి వస్తుంటే మూత్రం వుూత్ర, వీర్య పరీక్షలు చేయించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తారుు. రోజుకు రెండు మూడు సార్లు సెక్స్ చేసినప్పుడు సెక్స్ తర్వాత కొంచెం అలసట, నీరసంగా అనిపించడం సహజమే. మీరు ఒకసారి మూత్రపరీక్షలు, వీర్యపరీక్షలు చేయించుకుని అందులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలితే డాక్టర్ సలహా మేరకు యాంటిబయూటిక్స్ వాడటం వల్ల ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రోస్టరుుటిస్ (ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడేవారికి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ప్రోస్టెరుుటిస్ సమస్య ఉంటే యూరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స పొందాలి.
   
 నాకు 35 ఏళ్లు. గత రెండేళ్లుగా మూత్రంలో వుంట, మూత్రధార సరిగా రాకపోవడం, సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రాకపోవడం వంటి బాధలు అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, మూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయమేస్తోంది. పెళ్లికి వుుందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలామందితో సెక్స్‌లో పాల్గొన్నాను. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయేమోనని చాలా యాంటిబయాటిక్స్ వాడాను. అయినా ప్రయోజనం లేదు. నాకు  మంచి సలహా ఇవ్వండి.  - ఎస్.ఆర్.ఎస్., అనంతపురం


 మీరు మీ సమస్యకు ముందుగా రిట్రోగ్రేడ్ యుురెథ్రోగ్రామ్ (ఆర్‌జీయుూ) అనే పరీక్ష చేయించుకోవాలి. దీనిల్ల మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి (బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వుూత్రనాళాన్ని వెడల్పు చేయించుకుంటే మూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
 

మరిన్ని వార్తలు