పిన్నవయసులో సీఈవో

7 Dec, 2014 05:32 IST|Sakshi
పిన్నవయసులో సీఈవో

ప్రతిభాకిరణం
 
సింధూజ రాజ్‌మరాన్ అనే 16 ఏళ్ళ బాలిక భారతదేశంలో పిన్న వయసు సీఈవోగా గుర్తింపు పొందింది. చెన్నైలో పుట్టిన సింధూజ తండ్రి స్థాపించిన seppan అనే యానిమేషన్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితురాలైంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీస్ అనే సంస్థ సింధూజకు పిన్న వయసు సీఈవోగా గుర్తింపునిచ్చింది.

సింధూజ తండ్రి ఒక కార్టూనిస్ట్. తండ్రి ప్రోత్సాహంతోనే తను సీఈవో బాధ్యతలు చేపట్టగలిగిందని చెప్పారు. సింధూజ ఫ్లాష్, ఫొటోషాప్, కోరల్ పెయింట్, ఆఫ్టర్ ఎఫెక్ట్, మాయా మొదలైన సాఫ్ట్‌వేర్‌లలో నిష్ణాతురాలు. ప్రస్తుతం ఆమె ప్రఖ్యాత భారతీయ కంపెనీలకు సినిమాలు, యాడ్స్ రూపొందించే 18 సభ్యుల బృందానికి నేతృత్వం వహిస్త్తోంది. ఆమె ప్రపంచ సమస్యలపై, వ్యాధులపై లఘుచిత్రాలను నిర్మించింది. ఇప్పుడు ‘టీ నగర్’ అనే 2డి యానిమేషన్ సినిమాకి పనిచేస్తోంది.

 కోరల్ సంస్థ ఆమెను ప్రపంచంలోనే చిన్న వయసు డిజిటల్ కారికేచరిస్ట్‌గా గుర్తించింది. అంతేకాదు, నాస్‌కామ్ సంస్థ ఆమెకు వేగంగా పనిచేసే 2డి యానిమేటర్ అవార్డును ఇచ్చింది. తన స్వంత నిర్మాణసంస్థను ఏర్పాటు చేసుకుని సినిమా ప్రొడక్ట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా అందించాలన్నది సింధూజ ఆకాంక్ష.
 

మరిన్ని వార్తలు