ఈ వారం యూట్యూబ్ హిట్స్

25 Jul, 2016 00:12 IST|Sakshi
ఈ వారం యూట్యూబ్ హిట్స్

జస్టిస్ లీగ్ : స్పెషల్ ఫుటేజ్
నిడివి : 2 ని. 45 సె. ిహ ట్స్ : 55,30,593
 

ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ‘వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్’.. వచ్చే ఏడాది నవంబర్ 17న విడుదల చేయబోతున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘జస్టిస్ లీగ్’ చిత్రంలోని చిన్న ముక్కనొకదాన్ని కొద్ది గంటల క్రితమే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసింది. బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, వండర్ ఉమన్, ది ఫ్లాష్, ఆక్వామ్యాన్, ఐబోర్గ్ అనే ఆరుగురు సూపర్ హీరోలు ఒక జట్టుగా ఏర్పడి, ఈ ప్రపంచాన్ని ఒక మహా విపత్తునుంచి కాపాడే ప్రయత్నంలో చేసే సాహసాలే ఈ చిత్ర కథాంశం. 2డి, 3డి, ఐమాక్స్ 3డిలలో తయారవుతున్న జస్టిస్ లీగ్‌లోని కొన్ని సన్నివేశాలను ఈ స్పెషల్ ఫుటేజీలో శాంపిల్‌గా చూడొచ్చు.


జంకీ ఎక్సెల్ మ్యూజిక్ ఎఫెక్ట్, ఫేబియన్ వాగ్నర్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను కూడా వదిలిపెట్టకుండా సూపర్‌హీరో గ్రూప్‌లో సభ్యులుగానో, సూపర్ విలన్ టీమ్‌లో దుష్టసైనికులుగానో మార్చేయడం ఖాయం. వండర్ ఉమన్‌గా ఇజ్రాయేలీ నటి గాల్ గాడెట్ సమ్మోహన దరహాసాన్ని తప్పించుకోవడం కూడా కష్టమే. దీని సీక్వెల్ 2019 జూన్ 14న రిలీజ్ అవుతుందట! హాలీవుడ్ ప్లానింగ్ ఎలా ఉందో చూడండి!
 
 

మరిన్ని వార్తలు