స్లిట్‌ స్టైల్‌తో చింపెయ్‌!

16 Mar, 2018 08:46 IST|Sakshi

ఏదైనా పని గొప్పగా చేస్తేచింపేశారు అంటారు.వేసుకునే దుస్తులు కూడాఅంతే గొప్పగా ఉంటేచింపేశారు.. అనరా!ఈ స్లిట్‌ ఫ్యాషన్‌వేసెయ్‌.. చింపెయ్‌!

‘డ్రెస్‌ చాలా ట్రెడిషనల్‌గా ఉంది...కాస్త స్టైలిష్‌ లుక్‌ ఇస్తే బాగుండు ఎలా..’అనుకుంటున్నారా! చాలా సింపుల్‌. ఇలా ఒక స్లిట్‌ఇచ్చి చూడండి. నేటి తరానికి బాగా నప్పేఈ డిజైన్‌ సమ్మర్‌లో సౌకర్యంగానూ ఉంటుంది.

సంప్రదాయ టాప్‌కి స్టైలిష్‌ స్లిట్‌
పెళ్లికి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు ముఖ్యంగా లెహంగా ధరించాల్సిందే అని పెద్దవాళ్లు పట్టు బడితే మీ స్టైల్‌కి ఒక అదనపు హంగును ఎలా చేర్చాలా అని పెద్దగా ప్రయాసపడనక్కర్లేదు. టాప్‌గా ధరించే ట్రెడిషనల్‌ కుర్తీ, ట్యునిక్‌ వంటి వాటికి ఇలా స్లిట్స్‌ ఇస్తే చాలు. మీ వార్డ్రోబ్‌లో ట్రెడిషనల్‌ స్లిట్‌ టాప్‌ ఒకటి చేర్చండి. అది బెనారస్‌ లేదా జరీ వర్క్‌తో ఉన్నది ఏదైనా ఎంచుకోండి. అయితే, టాప్‌–బాటమ్‌ ఎప్పుడూ కాంట్రాస్ట్‌ ఉండేలా జాగ్రత్తపడండి.

దేశీయ పట్టుకువెస్ట్రన్‌ స్లిట్‌
బెనారస్, కంజీవరం వంటి పట్టు ఫ్యాబ్రిక్‌ను కూడా ఆధునికపు హంగులతో కొత్త లుక్‌ తీసుకురావచ్చు. లాంగ్‌ స్లిట్‌ కుర్తీకి బాటమ్‌ పార్ట్‌ జత చేయడంతో ట్రెడిషనల్‌ లుక్‌ వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే పూర్తి వెస్ట్రన్‌ లాంగ్‌ గౌన్‌లా, దేశీయ పట్టు ఫ్యాబ్రిక్‌ అవడంతో సంప్రదాయపు సొబగులతో ఆకట్టుకుంటుంది.

సమ్మర్‌కి సరికొత్త స్లిట్‌
వేసవి కాలం  సౌకర్యంగా లేని దుస్తులు ధరిస్తే చికాకు మరీ ఎక్కువ అవుతుంది. గెట్‌ టు గెదర్‌ వంటి పార్టీలకు స్టైలిష్‌గా అదే టైమ్‌లో కంఫర్ట్‌ అనిపించే డ్రెస్‌లో వెళ్లాలంటే ఇలాంటి స్పెషల్‌ స్లిట్‌ డ్రెస్‌ ఎంచుకుంటే చాలు. బాటమ్‌గా జీన్స్‌.. టాప్‌గా స్లిట్‌ లాంగ్‌ కుర్తీ ధరించండి.

వేదికల మీద వెలిగిపోయే స్లిట్‌
పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి ఇలాంటి ఇండో వెస్ట్రన్‌ డ్రెస్‌లు బాగా నప్పుతాయి. స్కర్ట్‌ మోడల్‌ని తలపించే ఫ్రిల్స్‌ బాటమ్‌ టాప్‌కి జత చేశారు. లాంగ్‌ స్లీవ్స్‌ ట్యూనిక్‌కి ముందు భాగంలో స్లిట్‌ ఇవ్వడంతో కుచ్చుల భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూర్తి డ్రెస్‌ ఆధునికపు హంగులతో ఆకట్టుకుంటుంది.

సౌకర్యవంతమైన స్లిట్‌
క్యాజువల్‌ లుక్‌తో సౌకర్యంగా అనిపించే ఇలాంటి డ్రెస్సులు వేసవికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. టు పీస్‌ ఫ్రాక్‌ను ఎంచుకోవాలి. టాప్‌ పీస్‌కి కుచ్చులున్న ముందు భాగంలో స్లిట్‌ ఇవ్వాలి. రెండు ఫ్లోరల్‌ ప్రింట్స్‌ అయినా కాంట్రాస్ట్‌ కాంబినేషన్స్‌ అవడంతో లుక్‌ స్టైలిష్‌గా మారిపోతుంది.

ఇలా మీరూ ప్రయత్నించవచ్చు. అది సంప్రదాయ దుస్తులైనా, వెస్ట్రన్‌ డ్రెస్‌ ఏదైనా స్లిట్‌ ఉంటే స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు.-నిర్వహణ: ఎన్‌.ఆర్‌.

Read latest Fashion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా