ఈ పదితో గుండె పదిలం

20 Oct, 2017 11:05 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: మనం ఆహారం తీసుకునే ముందు అవి తీసుకుంటే లావెక్కుతామా, స్లిమ్‌ అవుతామా అనే చూస్తాం కానీ..శరీర అవయవాలు ముఖ్యంగా గుండెకు సంబంధించి మనం తీసుకునే ఆహారం ఎలాంటి ప్రభావం చూపుతుందని మాత్రం ఆలోచించం. గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఈ పది ఆహారపదార్ధాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం మన వంటింట్లో అందుబాటులో ఉండే ఈ పదర్ధాలను డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యకరమైన గుండె మన సొంతమంటున్నారు నిపుణులు. మరి ఆ టాప్‌ 10 సూపర్‌ ఫుడ్స్‌ ఏంటో చూద్దాం...వెల్లుల్లి మన హృదయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే గుండె రక‍్తకణాలు పలుచన కావడంతో పాటు రక్త ప్రసరణ సాఫీగా జరిగి బీపీని కంట్రోల్‌లో ఉంచేలా చేస్తుంది.

 శరీర వేడిని తగ్గిస్తూ తాపాన్ని తీర్చే వాటర్‌మెలన్‌ గుండె ఆరోగ్యానికి వరప్రసాదం. ఇది కొలెస్ర్టాల్‌ లెవెల్‌ను తగ్గించడంతో పాటు ముప్పుకారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డిప్రెషన్‌ను దూరం చేసే డార్క్‌ చాక్‌లెట్‌ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.డార్క్‌ చాక్‌లెట్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యకర స్థాయిలో కొలెస్ర్టాల్‌ను మెయింటెయిన్‌ చేస్తుంది. నిత్యం ఓట్‌తో చేసిన ఆహార పదార్ధాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.వీటిలో ఉండే ఫైబర్‌తో చెడు కొవ్వులు తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగవుతుంది.

ఇక బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి నట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ర్టాల్‌ తగ్గడంతో పాటు అవసరమైన విటమిన్‌ ఈ, ప్రొటీన్ ఫైబర్‌లు శరీరానికి అందుతాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి గ్రీన్‌ టీ, ఫ్యాటీ ఫిష్‌, సినామన్‌లు ఎంతో ఉపకరిస్తాయని పలు అథ్యయనాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు