సంపూర్ణ ఆరోగ్యానికి 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్

31 Aug, 2014 02:44 IST|Sakshi
సంపూర్ణ ఆరోగ్యానికి 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్

జబ్బు చేసినప్పుడు చికిత్స ఇవ్వడం వైద్యం... జబ్బు రాకుండా నివారించే పద్ధతిలో చికిత్స అందించి, పదేళ్ల వయసు తగ్గిస్తే.. అదే ఏజ్ మేనేజ్‌మెంట్ మెడిసిన్. అరవైలో కూడా యవ్వనపు ఆరోగ్యాన్ని తీసుకొచ్చే ఈ వైద్య విభాగం మొదటిసారిగా మన దేశంలో అయిదేళ్ల క్రితం రేవా హెల్త్ సెంటర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్. ఒక జబ్బు, ఒక భాగం అని కాకుండా శరీరం మొత్తాన్ని పరిశీలించి, ఆరోగ్యాన్ని సమీక్షించి చికిత్స అందించడమే ఈ 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం.
 
గతి తప్పే ఆరోగ్యం, జీవనశైలి వ్యాధులకు ఉత్తమ పరిష్కారం 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగామ్ చిన్నవయస్సులో బాధ్యతలు తక్కువ కాబట్టి ఒత్తిడి తక్కువ. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి బాధ్యతలు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆహారం తీసుకోవడం క్రమం తప్పుతుంది. మహిళల్లో కూడా పని ఒత్తిడి పెరగడంతోపాటు, ఉపవాసాలు, ప్రెగ్నెన్సీ, హార్మోన్ల మార్పులు... ఇవన్నీ శరీర  ఫిజియాలజీలో మార్పులకు కారణం అవుతాయి. వీటన్నింటికి తోడు కాలుష్యం. సహజసిద్ధమైన ఆహారం లేకపోవడం ఆరోగ్యం గతి తప్పడానికి దోహదం చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ సమతుల్యం చేసి, అనుకూల స్థితికి రావడమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం.
 
ఈ చికిత్స తరువాత శరీర పనితీరు యవ్వనదశలో లాగ మెరుగుపడుతుంది. ఈ చికిత్సలో భాగంగా వ్యక్తి శరీరతత్వాన్ని, సమస్యల్ని అన్నింటికి సంబంధించిన హిస్టరీ తీసుకుంటారు. అవసరమైన అన్ని పరీక్షలూ చేస్తారు. అప్పుడు తదనుగుణమైన చికిత్స మొదలవుతుంది. డైట్ ద్వారా కొంత, న్యూట్రసుటికల్స్ (న్యూట్రిషన్ సప్లిమెంట్స్) ద్వారా మరికొంత, అవసరాన్ని బట్టి మందులు వాడుతూ ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. ఆరువారాలకు, నాలుగు, ఎనిమిది నెలలకు ఆరోగ్యాన్ని తిరిగి సమీక్షిస్తారు. జెనెటిక్‌మ్యాపింగ్ ద్వారా జబ్బు రాగల అవకాశాన్ని కూడా ఇప్పుడు ముందే తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది.  
 
 వివరాలకు
 800 800 1225
 800 800 1235  
 040 4454 4330
 మెయిల్: ksrgopal@revami.com
 వెబ్‌సైట్: www.revami.in/
 అడ్రస్: రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్
 జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా
 రోడ్ నెం.4, బంజారాహిల్స్, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు