డైరెక్షన్ టు ఫ్యాషన్

14 Aug, 2014 00:20 IST|Sakshi
డైరెక్షన్ టు ఫ్యాషన్

ఫ్యాషన్, మోడలింగ్ ఈ రెండు సినీలోకానికి దగ్గరి దారులు. అయితే సినీ ప్రపంచం నుంచి ఓ దర్శకుడు వీటికి మళ్లడం విశేషం. సంకీర్తన, కోకిల తదితర సినిమాలతో అభిరుచి కలిగిన ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు గీతాకృష్ణ. సిటీలో ‘ గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ’ ఏర్పాటు చేయనున్నారు. యాడ్విన్ సంస్థ ద్వారా అడ్వర్టయిజ్‌మెంట్ రంగంలోనూ విక్టరీ కొట్టిన గీతాకృష్ణ ‘సిటీప్లస్’తో ముచ్చటించారు.
 
ఫ్యాషన్‌లో యువతకు మంచి ఫ్యూచర్ ఉంది. అయితే ఇక్కడ  ఫ్యాషన్+ మూవీస్+ అడ్వర్టయిజ్‌మెంట్.. ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ లేవు. అందుకే ‘గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అండ్ ఫ్జీ’ ఏర్పాటు చేస్తున్నాను. అలాగే  యాడ్స్‌కీ, సినీరంగానికీ  ఉపయోగపడేలా యువత కోసం మా స్కూల్ ప్లాట్‌ఫార్మ్ అవుతుంయాషన్ టెక్నాలది.
 
 మేక్ స్మార్ట్ ఫిల్మ్స్
 షార్ట్ ఫిల్మ్స్ తీయడంలో యూత్ ఎంత క్రేజీగా ఉందో అందరికీ తెల్సిందే.  అయితే అంతగా జనాదరణ పొందలేకపోతున్నాయి. ఇందుకు కారణం అవగాహన లోపమే. అందుకే ‘నో మోర్ షార్ట్ ఫిల్మ్స్.. మేక్ స్మార్ట్ ఫిలిమ్స్’ అనే  క్యాప్షన్‌తో మేం దీనిని నిర్వహించనున్నాం. ఫ్యాషన్, సినిమా అనుబంధ రంగాలన్నింటిలోనూ శిక్షణ అందిస్తాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అవకాశాలు కూడా కల్పిస్తాం.
 
 ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్
 ఈ నెల 24న ఫార్చ్యూన్ కత్రియా హోటల్‌లో ఈ క్యూబ్ (ఎంటర్‌టైన్‌మెంట్-ఎంటర్‌టైన్‌మెంట్-ఎంటర్‌టైన్‌మెంట్) పేరుతో రోజంతా నడిచే వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. అదే రోజున సాయంత్రం వినూత్న తరహాలో ‘సౌందర్యలహరి’ ఫ్యాషన్‌షో ఉంటుంది. ఈ వేదిక మీద నుంచే మా స్కూల్ వెబ్‌సైట్ ప్రారంభించి, వివరాలు ప్రకటిస్తాం.
 - ఎస్బీ

మరిన్ని వార్తలు