చిట్‌చాట్: వెజ్జీ బుజ్జి

2 Aug, 2014 00:49 IST|Sakshi
చిట్‌చాట్: వెజ్జీ బుజ్జి

చిట్‌చాట్: శాకాహారమే బెటర్ అంటోంది నటి అదాశర్మ. తాను మొదటి నుంచీ వెజిటేరియన్‌నే అని చెబుతోంది ఈ అమ్మడు. ‘ నా ఫ్యాన్స్ కూడా శాకాహారులుగా మారితే సంతోషిస్తాను. శాకాహారంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను. మాంసాహారాన్ని కంప్లీట్‌గా వదిలేయాల’ని అదాశర్మ  అన్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం పెటా ఆధ్వర్యంలో శాకాహార ఆహారంపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అదాశర్మ నటించిన ప్రకటనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హిందీలో ఒక చిత్రం, తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు