సైక్లింగ్

7 Jul, 2014 01:06 IST|Sakshi

ఒంటి కాలితోనే పతకాలెన్నో సాధించాడు. ఏకంగా ‘లివ్కూ బుక్’కెక్కాడు. ఈ రికార్డుల హీరో.. వున హైదరాబాదీ ఆదిత్య మెహతా. ప్రపంచంలో ఎత్తరుున వునాలీ నుంచి ఖర్‌డంగ్‌లా రోడ్డుపై ఆదిత్య సైకిల్ యూత్ర చేపట్టనున్నాడు. ఈ యూత్ర విజయువంతం కావాలని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం ‘సైక్లింగ్ రైడ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్యతో ‘సిటీ ప్లస్’ వుుచ్చటించింది. ఆ విశేషాలు అతని మాటల్లోనే...
 
 పుట్టి పెరిగింది భాగ్యనగరిలోనే. ఓ పక్క చదువు, వురోవైపు స్నేహితులు, పబ్‌లు, క్లబ్‌లతో జీవితం సరదాగా గడిచిపోయేది. ఇగ్నోలో బీకామ్ చేసి నాన్న వ్యాపారంలోకి అడుగుపెట్టా. ఆ తర్వాత మనీషాను పెళ్లాడా. అంతా బాగున్న సమయంలో... 2006, ఆగస్టు 18న బుల్లెట్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రవూదంలో కుడి కాలు పూర్తిగా చచ్చుబడింది.  ఆ సవుయుంలో బతుకంటే భయుం కలిగింది. అయితే నాన్న మాత్రం ‘దేవుడు నీకు రెండో జీవితం ఇచ్చాడు. కాలు పోయినా ఫర్వాలేదు.. జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా సాధించు’ అని స్ఫూర్తిని రగిలించారు.  దక్షిణాఫ్రికా నుంచి బయోనిక్ లెగ్ తెప్పించుకుని కొత్త జీవితం ప్రారంభించా.
 
 ఒకసారి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ హోర్డింగ్ చూశా. ఆసక్తిగా అనిపించింది. సైక్లింగ్ చేయగలనా అని ఆలోచించా.  సైకిల్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ, పడుతూ లేస్తూ పర్‌ఫెక్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. హైదరాబాద్ టు బెంగళూరు  540 కిలోమీటర్లను సైకిల్‌పై మూడురోజుల్లో చుట్టి వచ్చా. 2013లో పారా ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్ కోసం చేస్తున్న ప్రాక్టీస్‌లో గాయాలైనా, అందులో భారత్ తరఫున పాల్గొని రెండు రజతాలు సాధించా. అదే ఏడాది లండన్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్  ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. కిందటేడాది డిసెంబర్‌లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 32 రోజుల పాటు సైక్లింగ్ చేశా. నా లక్ష్యం  2016 పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించడం.
- సాక్షి, సిటీప్లస్

మరిన్ని వార్తలు