అభ్యుదయ కవిత్వోద్యమానికి ‘అగ్నివీణ’

28 Dec, 2014 01:57 IST|Sakshi
అనిశెట్టి సుబ్బారావు

 అనిశెట్టి సుబ్బారావు 36వ వర్ధంతి
 కవిత్వం, నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు, కథానికలు, వ్యాసాలు, అనువాదాలు, సినిమా సాహి త్యం మొదలైన సాహిత్య ప్రక్రియలన్నింటినీ చేపట్టి, సమర్థవంతంగా నిర్వహించిన అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బారావు. తన కవితా ఖండికల్లో బిచ్చగాళ్లు, వేశ్యలు, శ్రామికులు, కార్మికులు, తినడానికి తిండిలేక అలమ టించే దీనులు సాక్షాత్కరిస్తారు. ఆయన ‘అగ్ని వీణ’ అభ్యుదయ కవితా ఉద్యమంలో గొప్ప కవితా సంపు టిగా ప్రశంసలు అందుకుంది. ప్రత్యేకించి బిచ్చగాళ్ల జీవి తపు లోతులను పరిశీలించి కరుణ రసాత్మకంగా చిత్రిం చారు. అనిశెట్టిపై తొలి రోజుల్లో గాంధీజీ ప్రభావం గాఢంగా ఉంది. 1942, ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా సందర్భం గా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్టయ్యాడు. రాయవేలూరు జైలులో రెండేళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు పేల్చిన ఘటనపై అణుబాంబు పేరిట సుదీర్ఘ కవితను రాశారు.

1946లో జరిగిన హిందూ ముస్లిం కలహాల మారణహోమంపై అనిశెట్టి భారత హృదయాక్రోశంగా ‘పృథ్వీగీతం’ కవితా ఖండికను రచిం చాడు. 1947లో కశ్మీర్ సమస్యపట్ల కలతచెంది, ‘నవభారతి’ గీతా న్ని రాశాడు. 1952లో అనావృష్టి కారణంగా రాయలసీమలో సంభ వించిన కరువుకు చలించి, ‘ఆకలిపాట’ను రాశాడు. ‘గాలిమేడలు’ నాటకంలో (1950) ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని తొలిసారిగా పాశ్చాత్య ప్రభావంతో ప్రవేశపెట్టిన ఘనత అనిశెట్టిదే. ‘ఫాంటోమేమ్’, డాన్స్ బ్యాలే మొదలైన ప్రక్రియలను తొలిసారిగా తెలుగులో రూపొందించాడు. ఆయన రాసిన ‘శాంతి’ (1950) తెలు గులో తొలి మూకాభినయం (ఫాంటోమేమ్). ఆయన ‘రిక్షావాలా’(1955) తెలుగులో తొలి నృత్య మూకాభినయం (డాన్స్ బ్యాలే). ‘శాంతి’ మూకాభినయం ఏలూరులో 1952లో సాంస్కృతిక మహాసభల ప్రదర్శనలో బంగారు పతకాన్ని పొందింది. తమిళం, కన్నడం, మలయాళం వంటి పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదిం చారు. ఇది ఇంగ్లిష్, చైనా, రష్యా భాషల్లో అనువాదమై అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. సినీకవిగా, ప్రేక్షకుల హృద యాల్లో నిలిచిపోయే అద్భుతమైన గీతాలు రాశారు. అభ్యుదయ కవిగా, అభ్యుదయ కవితోద్యమ సారథిగా అనిశెట్టికి విశేష స్థానం ఉంది. 1922 అక్టోబర్ 23వ తేదీన నరసరావుపేటలో జన్మించిన అనిశెట్టి 1979, డిసెంబర్ 27వ తేదీన మరణించారు. అధునిక తెలుగు సాహిత్యంలో ఆయన చిరస్మరణీయుడు.

 డా॥పి.వి.సుబ్బారావు,  అనిశెట్టి సాహిత్య పరిశోధకులు

మరిన్ని వార్తలు