జిఫీ జర్నీ

21 Oct, 2014 02:02 IST|Sakshi
జిఫీ జర్నీ

హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొచ్చే రోజులు పోయాయి! ఫుట్‌పాత్‌లు లేని రోడ్లు.. ఫుట్‌బోర్డుకు వేళ్లాడే జనాలు.. జీబ్రా క్రాసింగ్‌నూ ఆక్యుపై చేసే వాహనాలు.. మీటర్ పీకనొక్కేసే ఆటోలు వెరసి కాలుష్యం, ట్రాఫిక్ అనే బ్యాడ్ ఐడెంటిటీనీ హైదరాబాద్‌కి సెట్ చేశాయిప్పుడు! దీన్ని బ్రేక్ చేసే సంకల్పంతో రోడ్డెక్కింది ‘జిఫీ’! దీన్ని డ్రైవ్ చేస్తున్న యువకుడు అనురాగ్ రాథోడ్..
 
 నిజానికి ‘జిఫీ’ ఓ యాప్. హైదరాబాద్ జనాభా అంతా రోడ్ల మీదే ఉన్నట్టుండే రద్దీ.. కాలు తీసి కాలు వేయలేని దుస్థితి.. ఇలాంటి సిట్యువేషన్‌లో పడవలాంటి కార్లో ఒకే వ్యక్తి విలాసంగా ప్రయాణం చేసే పరిస్థితి.. అవి ప్రొడ్యూస్ చేసే పొల్యూషన్.. వీటన్నిటి మధ్య డైలీ బ్రెడ్ కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు జర్నీ చేసి వేసారిపోయిన ఓ విసుగులోంచి పుట్టింది ఆ యాప్. ఉద్యోగార్థం బయటకు వెళ్లే వాళ్ల ప్రయాణం సాఫీగా సాగేందుకు స్టీరింగ్ అందుకుంది.
 
 ఎలా..
 అనురాగ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగం దొరికింది. సిటీలో ఈ మూలనున్న ఇంటి నుంచి ఆ మూలనున్న ఆఫీస్‌కి వెళ్లాలి. బస్సులు.. షేరింగ్ ఆటోలు.. అత్యవసరమైనప్పుడు కార్‌లిఫ్టులు.. ఈ ట్రాన్స్‌పోర్ట్ టూల్స్ అన్నీ తన రోజూవారీ జర్నీలో భాగమయ్యాయి. ఆఫీస్‌లో పనికన్నా ఈ ప్రయాణమే స్ట్రెస్ అనిపించేది అనురాగ్‌కి. ఈ ట్రాఫిక్‌లో తనలాగే సఫకేషన్ ఫీలవుతున్న స్నేహితులు కలిశారు అనురాగ్‌తో. ప్రయాణాన్ని సుఖవంతం చేసుకొనే మార్గమే లేదా అని ఆలోచించారు. అప్పటికే ఆన్ రోడ్ ఉన్న కార్ పూలింగ్ పెద్ద ప్రయోజనకరంగా అనిపించలేదు ఈ మిత్ర బృందానికి. అదర్ న్యూ పాత్ వెదకాలి సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ కోసం అని బ్రెయిన్ బ్రేక్స్ టైట్ చేశారు.

 పూల్ ఎ కార్.. షేర్ ఎ రైడ్..
 ఓ ‘కొత్త దారి’ కనుక్కున్న అనురాగ్.. ఆ జర్నీకి జిఫీ అని పేరుపెట్టి ఓ యాప్‌ను తయారు చేశారు. కార్లున్న ఉద్యోగస్తులు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద ఆధారపడిన ఉద్యోగస్తులను ట్రావెలింగ్ ఇన్ ది సేమ్ వెహికిల్ ప్యాసింజర్స్‌గా మార్చాలనుకున్నారు. ఒకే ప్రాంతం నుంచి బయలుదేరి ఒకే గమ్యానికి చేరుకునే ఈ వాహన ఆసాములు, వాహనాల్లేని వాళ్లను కలపాలి.
 
  కారున్నవాళ్లు కారులేని ఓ నలుగురికి (వాహన సామర్థ్యాన్ని బట్టి) తమ వాహనంలో స్థానం కల్పిస్తారు. తమ గమ్యస్థానం చేర్చినందుకు కొంత పైకాన్ని (షేరింగ్ ఆటోకన్నా తక్కువే) వసూలు చేస్తాడు కారు ఓనర్. ప్యాసెంజర్ చెల్లించే డబ్బు అతని ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి డెబిట్ అయి కార్ ఓనర్ పేరునున్న జిఫీ అకౌంట్‌కి క్రెడిట్ అవుతుంది. దీనివల్ల కూకట్‌పల్లి, దిల్‌షుక్‌నగర్ ప్రాంతాల్లోని చాలామంది వాహనదారులు పెట్రోల్ ఖర్చే కాకుండా నెలకు తమ ఈఎమ్‌ఐకి సరిపడా డబ్బునూ సంపాదించినట్టు చెప్పారు.
 
 ఈ సౌకర్యం వల్ల ఒక్క కారులో ఒక్కో వ్యక్తి వెళ్లడంతో అయ్యే ఖర్చు, పెట్రోల్ వినియోగం, కాలుష్యం, ట్రాఫిక్.. ఇన్నింటినీ తగ్గిస్తుంది. పైగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఉండే అసౌకర్యాన్ని, ఆటోవాలాలు చేసే మీటర్ మీద డిమాండ్‌నూ తప్పించుకోవచ్చు’ అంటాడు జిఫీ సీఈవో అనురాగ్ రాథోడ్. జిఫీలో అకౌంట్‌దారు కావాలంటే ముందుగా కారు ఓనర్ ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ‘పూల్ ఎ కార్ షేర్ ఎ రైడ్’కి దరఖాస్తు చేసుకోవాలి. కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, పర్సనల్ డీటైల్స్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. వాటిని సిబ్బంది సంబంధిత ప్రభుత్వ అధికారుల సహాయంతో పరిశీలిస్తుంది. వాళ్లు సమర్పించినవన్నీ నిజమైనవే అని తేలితేనే రిజిస్ట్రేషన్ పూర్తిచేస్తుంది. ప్యాసింజర్స్ విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరిస్తుంది. పికప్ పాయింట్ అండ్ డ్రాప్ పాయింట్ అన్నీ యాప్‌లో లోైడై ఉంటాయి.
 
 ఒకవేళ ఎప్పుడైనా వాహన చోదకులు, ప్రయాణికుల విషయంలో ఏదైనా తేడా వచ్చి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితిని పసిగట్టే అలర్ట్ కూడా ఈ యాప్‌లో ఉంటుంది. అది జిఫీ సిబ్బందికి, ఆ వాహనం దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కీ డేంజర్ అలర్ట్‌ను పంపిస్తుంది. పూల్  ఎ కార్ షేర్ ఎ రైడ్‌ను ఉపయోగించుకోవాలనుకునే మహిళలకు ఇది ఎంతో భద్రం. చివరగా దీని వల్ల ఇంకో లాభం కూడా ఉందంటాడు అనురాగ్. ‘పక్కింటి వాళ్లెవరో తెలియనంత బిజీనెస్‌లో పడిపోయిన వాళ్లకు ఈ అవైలబిలిటీతో ఆ బిజీని తగ్గించుకొని రైడ్‌నే కాదు మనసునూ షేర్ చేసుకొనే మంచి కంపానియన్ దొరకొచ్చు. రోజూ కలిసి జర్నీ చేయడంవల్ల వాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవుతుంది. మాటలు కలిసి మదిలోని భారం తగ్గుతుంది. హ్యాంగవుట్‌ని బ్రేక్ చేయడానికి ఇంతకు మించిన సాధనం ఏముంటుంది?’ అంటాడు. అందుకేనేమో జిఫీ సెక్యూర్, అఫర్డబుల్, క్యాష్‌లెస్ అండ్ సోషల్’ అనే నాలుగు లక్షణాల లక్ష్యంగా సాగుతోంది.
 - సరస్వతి రమ

మరిన్ని వార్తలు