నడుము నొప్పితో బాధపడుతున్నారా?

24 Sep, 2014 01:51 IST|Sakshi
నడుము నొప్పితో బాధపడుతున్నారా?

అధునాతనమైన పద్ధతుల్లో సర్జరీ చేయడంవల్ల ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోనవసరం లేకుండానే తొందరగా కోలుకుని రోజువారీ పనుల్లో నిమగ్నమైపోవచ్చు.
 
 నడుము నొప్పి ఈ రోజుల్లో సర్వసాధారణం.  వెనుకటి తరం వారితో పోల్చిచూస్తే ఈతరం వారు ఎక్కువగా నడుమునొప్పి సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామాలు తగ్గడం, ఎక్కువగా ద్విచక్రవాహనంపై ప్రయాణించడం, కంప్యూటర్, ఫోను వినియోగం పెరగడం,  మానసిక, శారీరక ఒత్తిడి పెరగడంవల్ల కూడా నడుము నొప్పి రావడానికి కారణమవుతాయి. అప్పటికే ఉన్న నొప్పి పెరిగి దైనందిన కార్యక్రమాలకు కూడా అంతరాయం కలగడానికి, ప్రమాదకర  పరిస్థితికి చేరడానికి కూడా అవకాశముంది. 99 శాతం నడుమునొప్పులకు సరైన సమయంలో, సరైన వైద్యం అందితే ఈ సమస్య నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. చాలా మంది అశ్రద్ధ చేసి ఈ సమస్యను జటిలం చేసుకుంటున్నారు.
 
 తొలి దశ : ప్రారంభ సమయంలో నడుము నొప్పి కండరాల బలహీనత వల్ల వస్తుంది. అలాంటి సమయంలో అలవాటులేని పని ఎక్కువగా చేస్తే నొప్పి కలుగుతుంది. అయితే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ నొప్పి తగ్గుతున్నట్టనిపించినా.. తరువాత తిరగబెడుతుంది. ఈ సమయంలో సరైన మందులతో పాటు బలహీనమైన కండరాలను గుర్తించి, వాటిని బలపరిచే విధంగా చికిత్స చేయాలి.
 
 మధ్య దశ : ఈ దశలో వెన్నెముక మధ్యలో ఉన్న డిస్క్‌పై ఒత్తిడి పెరిగి డిస్క్ పక్కకు జరిగి పక్కనున్న నరాలపై ప్రభావం పడడం వల్ల నడుము నొప్పి పెరగడం, కాళ్లలో తిమ్మిర్లు, లాగడం, కరెంటు షాక్‌కు గురైనట్లు, సూదులతో గుచ్చినట్లుగా ఉంటుంది. ఈ స్థితిలో సర్జరీ లేకుండా రూట్ బ్లాక్, ఎపిడ్యూరల్ ఇంజక్షన్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ దశలోనే వెన్నెముకలో ఉన్న జాయింట్స్ అరగడంవల్ల పొద్దున నిద్ర లేవగానే నడుం పట్టేసినట్లుంటుంది. మెల్లగా నాలుగు అడుగులు నడిస్తే ఉపశమనం పొందుతారు. అలాగే ముందుకి గాని, వెనక్కి గాని, పక్కలకు గాని వంచినప్పుడు నిర్ణీత ప్రదేశంలో నొప్పిగా అనిపించవచ్చు. అలాంటివారు ఫేసెట్ బ్లాక్ ఇంజెక్షన్ ద్వారా ఉపశమనం పొందవచ్చు.  
 
మూడో దశ : రెండో దశలో ఉన్న సమస్యలన్నీ మరింత ఎక్కువగా విజృంభిస్తాయి. కాళ్లు బలహీనపడడం, మలమూత్రాలపై నియంత్రణ కోల్పోతారు. ఇలాంటి సమయంలో అధునాతన సర్జరీతో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇలాంటి అధునాతన టెక్నాలజీ ప్రక్రియ ద్వారా ఎంతో కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో అవసరమైన వారికి మాత్రమే సర్జరీ చేస్తూ, మిగతా వారికి సర్జరీ లేకుండానే సత్ఫలితాలను సాధించవచ్చు.
 - డా॥ రాఘవ సునీల్
 కన్సల్టెంట్ ఆర్థోపెడిక్
 స్పైన్ సర్జన్, హైదరాబాద్
 9000060639, 9533557557

మరిన్ని వార్తలు