‘ఆర్ట్’ సోప్

17 Nov, 2014 01:51 IST|Sakshi
‘ఆర్ట్’ సోప్

కళాహృదయం ఉండాలే గానీ... ఆ కళ్లకు ప్రతిదీ కళాత్మకమే. పనికొచ్చేవి... పనికిరానివి... కళాకారుల చేతిలో పడితే ఏ వస్తువైనా కళాఖండమే. అపురూపమే. బాత్‌రూమ్‌కే పరిమితమైన సబ్బు బిళ్లను బొమ్మలుగా మలిచి ప్రత్యేకతను చాటుకొంటున్నారు నగరవాసి సహానా.

బాత్ సోప్‌లపై బుజ్జి బుజ్జి పాపాయిలు, వారి చిట్టి పాదాలు, చంద్రునిపై చిన్నారులు, ప్రేమ చిహ్నాలు, పువ్వులు.. ఇలా కళారూపాలను చెక్కుతున్నారామె. వీటిని బర్త్‌డే గిఫ్ట్స్‌గా ఇస్తే... ఓ సరికొత్త తీపి గుర్తుగా మిగిలిపోతుందంటున్నారు. ఆర్డర్ ఇస్తే... చిన్నారుల ఫొటోలను కూడా వాటిపై మౌల్డ్ చేయడం సహానా స్పెషల్. బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఆదివారం నిర్వహించిన ‘వెగాన్ ఫెస్ట్’లో తన ఆర్ట్ సోప్స్‌ను ఆమె ప్రదర్శించారు.
 
చిన్నారులకు నచ్చేలా...

‘మార్కెట్‌లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిపైన ఎలాంటి ఆర్ట్ ఉండదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదనిపించింది. ఆ ఆలోచనే ఇప్పుడీ కళాకృతులు. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకొని... వారికి రిలేటెడ్‌గా ఉండే వాటిని తీర్చిదిద్దుతున్నా. మార్కెట్‌లో రా మెటీరియల్స్ తెచ్చి, ఆర్ట్‌ను బట్టి కలర్స్ ఎంపిక చేసుకుంటా. ఏడాది పైబడినవారెవరైనా ఈ సోప్స్ ఉపయోగించవచ్చు. ధర రూ.250 నుంచి ఉన్నాయి’ అన్నారు సహానా.

-విజయ

మరిన్ని వార్తలు