సృజనకు పట్టం

24 Nov, 2014 22:50 IST|Sakshi
సృజనకు పట్టం

రెక్కలు తొడిగిన ఊహలకు ఆ చిట్టి కుంచెలు అద్భుతమైన రూపాన్నిచ్చాయి. అబ్బురపరిచే కళను రంగులతో కలగలిపి కాన్వాస్‌పై ఒలకబోసి అదరహో అనిపించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి పెయింటింగ్ పోటీలు చిన్నారుల ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. 50 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్ చిన్నారులే మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

కోన సుధాకర్ రెడ్డి
 
ఫుల్ హ్యాపీ
గతంలో జరిగిన పోటీల్లో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతాను. నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ పెయింటింగ్ వేశాను.

- కె.దివిజ, ఏడో తరగతి,డీఏవీ పబ్లిక్ స్కూల్, కూకట్‌పల్లి
 
మొదటిసారైనా..
ఇలాంటి పోటీలో నేను పాల్గొనడం ఇదే తొలిసారి. సెకండ్ ప్లేస్‌లో నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ఆనందాన్ని ఫ్యామిలీ, టీచర్లు, స్నేహితులతో పంచుకుంటా. చిన్నపిల్లలు-నీటి సంర క్షణ కాన్సెప్ట్‌ను కాన్వాస్‌పై చూపాను.

- జి.అమృత లక్ష్మి, ఎనిమిదో తరగతి,కేంద్రియ విద్యాలయం, బేగంపేట్.
 
ఇదే స్ఫూర్తితో..
రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలో నాకు ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది.లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చిన ఘట్టాన్ని.. ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చిత్రం గీశాను. ఇలాంటి పోటీలు చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

 - ఇ.శ్వేత, తృతీయ బహుమతి విజేత, ఎనిమిదో తరగతి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్- 1, ఈసీఐఎల్

మరిన్ని వార్తలు