బిల్‌ గేట్స్‌ చెప్పిన ఐదు పుస్తకాలు

21 May, 2020 09:30 IST|Sakshi

కాలంకంటే ముందే పుట్టి, కాలంకంటే ఒకడుగు ముందు నడుస్తున్న మనిషిలా ఉంటారు బిల్‌ గేట్స్‌. కాలానికి జలుబు చేయబోతోంది, కాలానికి పలానా పుస్తకాలు మంచి మెడిసిన్‌ అని కూడా చెబుతుంటారు. వేసవికాల పఠనం కోసం ఇప్పుడు ఆయన 5 పుస్తకాలు సూచించారు. వాటిల్లో ‘నోబెల్‌’ దంపతులు అభిజిత్‌ బెనర్జీ, ఎస్తర్‌ డూఫ్లో రాసిన ‘గుడ్‌ ఎకనమిక్స్‌ ఫర్‌ హార్డ్‌ టైమ్స్‌’ కూడా ఉంది. మిగతా నాలుగు.. ది ఛాయిస్‌ (డాక్టర్‌ ఎడిట్‌ ఈవా ఎగర్‌), క్లౌడ్‌ ఎట్లాస్‌ (డేవిడ్‌ మిట్చెల్‌), ది రైడ్‌ ఆఫ్‌ ఏ లైఫ్‌ టైమ్‌ (బాబ్‌ ఈగర్‌), ది గ్రేట్‌ ఇన్‌ ఫ్లూఎంజా (జాన్‌ ఎం బ్యారీ). బిల్‌ గేట్స్‌ ఏదైనా చెప్పారంటే అందులో మానవాళి శ్రేయస్సు ఉంటుందనే. కోవిడ్‌ 19 పొంచి ఉందని 2015 లోనే చెప్పారు ఆయన ఒక స్పీచ్‌లో!! అప్పుడే ఇంకో మాట కూడా చెప్పారు. కనీసం కోటీ యాభై లక్షల మందికి సంక్రమించాక కానీ కోవిడ్‌ శాంతించదని!!
 

మరిన్ని వార్తలు