ఆ తాతకు పెళ్లిళ్ల తహతహ..

13 Nov, 2017 18:46 IST|Sakshi

లండన్‌: ఆ తాతకు పెళ్లంటే మహా సరదా..కానీ పెళ్లయిన కొద్దిరోజులకే భార్యలు హ్యాండ్‌ ఇస్తుంటే ఆయన మాత్రం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా తొమ్మిదవ భార్య గత వారం చెప్పా పెట్టకుండా చెక్కేయడంతో తాతగారు మరో అమ్మాయిని మనువాడతానంటున్నాడు. తన భార్యకు పెద్దగా కండిషన్లు పెట్టనని, 30 ఏళ్లకు అటూ ఇటూగా ఉంటే చాలని ఈ 69 ఏళ్ల పెళ్లికుమారుడు సిగ్గుపడుతూ చెబుతున్నాడు. బ్రిటన్‌కు చెందిన రాన్‌ షెఫర్డ్‌ను ఇటీవలే తన తొమ్మిదో భార్య తనకంటే 41 ఏళ్లు చిన్నదైన క్రిస్టెట్‌ మార్క్వెజ్‌ (28) విడిచిపెట్టి వెళ్లిపోయింది.

ఆ భాద నుంచి అప్పుడే తేరుకున్న రాన్‌ షెఫర్డ్‌ మరో భార్య కోసం  అన్వేషణ మొదలెట్టాడు. ఓ భార్య వెళ్లిపోయిందని ఊరుకుంటామా అంటూ మరొక భార్య కోసం వేచిచూస్తున్నానని, ఈ సారి బాగా పరిణితి చెందిన యువతి కోసం చూస్తున్నానని చెప్పాడు. ఫేస్‌బుక్‌లో పలువురు మహిళలతో మాట్లాడుతున్నానని పెళ్లి ముచ్చట్లు చెప్పుకొచ్చాడు రాన్‌ షెఫర్డ్‌.

భార్యల లిస్ట్‌ ఇలా...

1966లో రాన్‌ తొలి భార్య మార్గరెట్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు.కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చన షెఫర్డ్‌ అప్పటి నుంచి వరుస పెళ్లిళ్లీ బాట పట్టాడు. రెండేళ్లు కాపురం చేసి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1973లో జెనెట్టేను వివాహమాడాడు. ఇక 1976లో ముచ్చటగా మూడోభార్యగా లెస్లీకి చేరువయ్యారు. ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత 1981లో లెస్లీకి విడాకులిచ్చి ఏడాది అనంతరం 1982లో కాథీని పెళ్లాడాడు. 1986లో ఐదో భార్యగా సూను చేరదీసిన రాన్‌ షెఫర్డ్‌ ఒక కుమార్తె కలిగిన అనంతరం 1997లో వీరి వైవాహిక జీవితానికి బ్రేక్‌ పడింది.

ఇక 1999లో ఆరో భార్యగా ఉషా ఆయన జీవితంలోకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత వీరి బంధమూ వీడిపోయింది.2003లో వాన్‌ అనే యువతిని జీవిత భాగస్వామిగా చేసుకుంటే ఆమె కేవలం నాలుగు నెలలకే రాన్‌కు బై చెప్పేసింది. ఇక​ 2004లో వాంగ్‌ అనే మహిళను ఎనిమిదో భార్యగా ఆహ్వానించాడు. పదేళ్ల పాటు వీరి జీవితం సాఫీగా సాగినా 2015లో వీరు విడిపోయారు. అనంతరం తొమ్మిదవ భార్యగా వచ్చిన క్రిస్టెట్‌ గత వారం రాన్‌కు వీడ్కోలు పలుకుతూ తనదారి తాను చూసుకుంది.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు