ఆలస్యంగా నిద్రిస్తే పిచ్చెక్కే ప్రమాదం!

16 Nov, 2017 09:38 IST|Sakshi

లండన్ ‌: ఆలస్యంగా నిద్రపోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అర్ధరాత్రి దాటేదాకా టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లతో గడిపి ఆ తర్వాత ఎప్పటికో పడుకోవడం.. తెల్లారి ఆలస్యంగా నిద్రలేచి హడావుడి పడడమూ నిత్యకృత్యమే! ఇలా ఆలస్యంగా నిద్రించేవాళ్లకు పిచ్చెక్కే ప్రమాదం ఉందని బ్రింగ్‌హాటన్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్ర చాలకపోతే అనారోగ్యాలు పాలయ్యే ప్రమాదం ఉందనే విషయం తెలిసిందే! దీంతోపాటు హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు, మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని తెలిపారు.

ఈమేరకు మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 మందిని వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది. ఈ అధ్యయనంలో వాళ్ల మానసిక అనారోగ్యానికి కారణం నిద్రలేమి అని తేలిందట! ఇక నిద్రలేమితో ఎదురయ్యే ఇతర అనారోగ్యాలు.. రాత్రి సరిగా నిద్రించకపోతే ఉదయం లేవగానే చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, హింసాత్మక ఆలోచనలు, భయం లేకపోవడం, పొంతనలేని వాగుడు, ఆత్మహత్య ఆలోచనలూ చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు