అదరగొడుతున్న భారత సంతతి

6 Feb, 2014 13:16 IST|Sakshi
అదరగొడుతున్న భారత సంతతి

భారత సంతతి అంతర్జాతీయ స్థాయిలో పలు అతి పెద్ద సంస్థల పగ్గాలు చేపట్టి తమ సత్తా చాటుతున్నారు. విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు చేస్తున్న టాప్‌ టెన్‌ అత్యంతకీలక సిఇఓల సరసన ఇప్పుడు సత్య నాదెళ్ల  చేరారు.  ప్రమోటర్ కాకుండా  అతి పెద్ద సాప్ట్వేర్ కంపెనీ మైక్రోసాప్ట్కు  సత్య సిఇఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంద్రనూయి, లక్ష్మిమిట్టల్‌, అన్షుజైన్‌,ఇవాన్‌ మెనెంజీస్‌ లాంటి భారతీయ సంతతికి చెందిన వారు విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. దాదాపుగా 12 మంది భారతీయ సంతతికి చెందిన వారు వరల్డ్‌ టాప్‌కంపెనీల్లో అత్యున్నత సిఇఒ పదవుల్లో కొనసాగుతుండటం గర్వకారణం. అటువంటివాటిలో మైక్రోసాప్ట్‌, పెప్సికో, ఆర్సిలర్‌ మిట్టల్‌, డాయిచీ బ్యాంక్‌, డియాగో, మాస్టర్‌ కార్డ్‌ లాంటి కంపెనీలున్నాయి. ఇంతకు ముందు సిటీ గ్రూప్‌, వోడాఫోన్‌, మోటరోలా కంపెనీల సిఇఒలు సైతం భారతీయ సంతతికి చెందిన వారే ఉండేవారు.

అతి పెద్ద కంపెనీలు ఆర్సిలర్‌ మిట్టల్(లక్ష్మీమిట్టల్), రెక్కిట్ బెంకైజర్(రాకేష్ కపూర్), మాస్టర్ కార్డ్(అజయ్ బంగా), డిబిఎస్ గ్రూప్ హోల్డింగ్స్(పియూష్ గుప్త), శాన్డిస్క్(సంజయ్ మెహ్రోత్ర),గ్రోబల్ ఫౌడ్రీస్( సంజయ్ ఝా), ఎడాబ్(శంతనుడు నారాయెన్) భారత సంతతి సారధ్యంలోనే నడుస్తున్నాయి. ఇవాన్‌ మెనెంజీస్‌  గత సంవత్సరం యుకె కేంద్రంగా నిర్వహించే అతి పెద్ద మద్యం వ్యాపార సంస్థ డియాజియోకు చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అన్షుజైన్ జర్మనీకి చెందిన డాయిచీ బ్యాంక్‌కు కో-సిఇఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో అతి పెద్ద సంస్థలైన సిటీగ్రూప్, ఓడాఫోన్, మోట్రోలా వంటి కంపెనీలకు కూడా భారత సంతతికి చెందినవారే సిఇఓలుగా వ్యవహరించారు.

 భారత సంతతి సిఇఓలుగా వ్యవహరించే 10 టాప్‌ కంపెనీల వ్యాపారం విలువ అక్షరాల 350 బిలియన్‌ డాలర్లని అంచనా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారి సారధ్యంలో నడిచే వ్యాపారం  విలువ భారత ఎగుమతులకంటే ఎక్కువగా ఉంటుందని ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ వెల్లడించింది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో కూడా భారత సంతతి ఉన్నత పదవులు అధిష్టించి తమ ప్రతిభను చాటుతున్నారు.  

మానవ వనరుల నిపుణుల అంచనాల ప్రకారం భారతదేశంలో నిపుణులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. భారతీయ నిపుణులు సాంకేతికంగా మంచి నైపుణ్యం గలవారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోని ముందుకు సాగిపోగల  సమర్ధులని తేల్చారు.

s.nagarjuna@sakshi.com

మైక్రోసాప్ట్ సిఇఓగా సత్య నాదెళ్ల ఫోటోలు...

మరిన్ని వార్తలు