నానా సిక్స్ ప్యాక్!

6 Jan, 2015 02:47 IST|Sakshi
నానా సిక్స్ ప్యాక్!

క్యారెక్టర్ డిమాండ్ చేసిందో... లేదంటే నాకేంటి తక్కువనుకున్నాడో... బాలీవుడ్ నటుడు నానాపటేకర్ లేటు వయసులో సిక్స్ ప్యాక్ బాటపట్టాడు. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లే అలవాటున్నా.. ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేయలేదు ఈయన. రీసెంట్‌గా ఆమిర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, హృతిక్‌రోషన్, అజయ్‌దేవ్‌గణ్ వంటి స్టార్లకు సిక్స్ ప్యాక్ సమకూర్చిన ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా యాభై ఏళ్ల నానాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడట. ‘యాభై ఏళ్ల తరువాత సిక్స్ ప్యాక్ రాబట్టాలంటే కొంత కష్టమే. ఈ వయసులో జీవన క్రియ మందగిస్తుంది. అయినా నానాకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ. ఆయనతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభూతినిస్తుంది’ అన్నాడు సత్యజిత్. సో... లెట్స్ వెయిట్ ఫర్ ‘సిక్స్ ప్యాక్ నానా’.
 

>
మరిన్ని వార్తలు