చిల్డ్రన్స్ క్లిక్ అవుట్

14 Nov, 2014 01:57 IST|Sakshi
చిల్డ్రన్స్ క్లిక్ అవుట్

ప్రోత్సహించే వారుంటే అడుగున దాక్కున్న ప్రతిభ కూడా అంబరాన్ని తాకుతుంది. అద్భుతాలను ఆవిష్కరించి అదరహో అనిపిస్తుంది. చదువే లోకంగా బతికే ఆ చిన్నారులకు కాసింత ఆటవిడుపు దొరికితే చాలు. వారి మస్తిష్కాల్లో అందరి మన్ననలు అందుకునే ఆలోచనలు అంకురిస్తాయి. చిన్నారుల్లో దాగి ఉన్న మరో కోణాన్ని వెలికితీసే ప్రయత్నం సాక్షి సిటీప్లస్ చేసింది. బాలల దినోత్సవం సందర్భంగా గడుగ్గాయిల చేతులకు కెమెరాలు అందించింది. వన్ డే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లుగా స్వేచ్ఛనిచ్చింది.

సాక్షి సపోర్ట్‌ను అందిపుచ్చుకున్న నవ్య గ్రామర్ స్కూల్, అంబర్‌పేటకు చెందిన 12 మంది విద్యార్థులు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కలియ తిరిగారు. రాజసం ఉట్టిపడే వన్యప్రాణుల హావభావాలు లెన్స్‌తో చూసి మురిసిపోయారు. అంతే ఠీవీ ఉట్టిపడేలా వాటిని క్లిక్ మనిపించారు.

వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం.. ఒక్కో ఫొటో ఒక్కో జీవ వైవిధ్యం. పుస్తకాలతో కుస్తీ పట్టడంలోనే కాదు.. కెమెరాలు క్లిక్‌మనిపించడంలోనూ తామేం తక్కువేం కాదని నిరూపించారు. ఈ చిన్నారులు క్లిక్ మనిపించిన చిత్రాల్లో.. ‘బెస్ట్ సిక్స్’ ఇక్కడ ప్రచురిస్తున్నాం.  
 
పిల్లలతో ఇలా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ తీయించడం చాలా మంచి ఆలోచన. భవిష్యత్తులో కూడా ‘సాక్షి సిటీప్లస్’ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే బాగుంటుంది. చిన్నారులకు వన్యప్రాణులు తదితర అంశాలపై అవగాహన పెరుగుతుంది.
 - జి.భాస్కర్‌రెడ్డి,
 నవ్య గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్

మరిన్ని వార్తలు