కప్పు మనదే..

2 Mar, 2015 00:19 IST|Sakshi
కప్పు మనదే..

ఫటాఫట్
వరల్డ్ కప్‌లో దుమ్ము రేపుతున్న ధోనీ సేన.. ఈసారి కూడా కప్పు కొట్టేస్తుందంటోంది ముద్దుగుమ్మ నందిత. క్రికెట్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో వస్త్రవిభ-2015 ప్రారంభోత్సవానికి నందిత విచ్చేసింది. రామ్‌లీలా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు శ్రీపురం కిరణ్‌లతో కలసి ఎక్స్‌పోలో కలియ తిరిగింది.

ఈ సందర్భంగా నందిత తో సిటీప్లస్ ఫటాఫట్... 
    - సత్య, శ్రీనగర్ కాలనీ
 
రామ్‌లీల సక్సెస్ టాక్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..?
రామ్‌లీల బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ టాక్ తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేమక థా చిత్రంలో భయపెట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాను. లవర్స్ మూవీతో యువతరానికి మరింత దగ్గరయ్యాను. రామ్‌లీల నా ఇమేజ్‌ను మరింత పెంచుతుందన్న నమ్మకం ఉంది.

క్రికెట్ చూస్తున్నారా..?
ఓహ్..! ఇండియా మ్యాచ్ అయితే అస్సలు మిస్సవ్వను. మనవాళ్లు భలేగా ఆడుతున్నారు. కప్పు గెలిచే అవకాశం మరో దేశానికి ఇవ్వరు.
 
మీ అభిమాన క్రికెటర్లు..?
ధోని, కోహ్లీ..
 
మరి మీ అభిమాన నటుడు..?
ప్రిన్స్ మహేష్‌బాబు. ఆయన సినిమాలన్నీ చూస్తుంటాను.
 
మీ తర్వాతి చిత్రం..?
మహేష్‌బాబు బావ సుధీర్‌బాబుతో కలసి నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ త్వరలో విడుదలకానుంది. మరో రెండు చిత్రాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి.
 
మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా..?
పర్టిక్యులర్‌గా అంటూ ఏం లేదు. ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది.
 
మీ ఫ్యాషన్ ఫార్ములా..?
ఆధునిక వస్త్రాలంటే ఎక్కువగా ఇష్టపడతాను.
 
హైదరాబాద్ గురించి..?
బ్యూటిఫుల్ సిటీ. నేను ఎక్కువగా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాను. బోర్ కొడితే మాత్రం ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌పై చక్కర్లు కొడతాను. అక్కడ దొరికే జంక్ ఫుడ్ భలే రుచిగా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా