చిత్రమయం..

20 Dec, 2014 23:47 IST|Sakshi
చిత్రమయం..

మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆర్ట్ మేళాలో నగరానికి చెందిన కళాకారులు వేసిన చిత్రాలు అందరి మన్ననలు అందుకుంటున్నాయి. రెండు రోజుల కిందట మొదలైన ఈ చిత్ర ప్రదర్శన ఇవాళ్టితో ముగియనుంది. విభిన్న ఆలోచనలకు తమ పెయింటింగ్స్ ద్వారా రూపాన్నిచ్చిన కళాకారులు కనువిందు చేస్తున్నారు.
 
రాచఠీవీకి అద్దం..
ప్రకృతి రమణీయత, మగువల సౌందర్యం చిత్రాల్లో చూపించే ప్రయత్నం చేస్తుంటాను. రాజుల కాలం నాటి చిత్రాలు వేయడమంటే నాకు ఇష్టం. మహారాణుల ముఖ కవళికలు అద్భుతంగా చూపించగలిగినపుడే మన కుంచె పనితనం తెలుస్తుంది. అందుకే ఎక్కువగా అలాంటి పెయింటింగ్సే వేస్తుంటాను.
- షాహిన్
 
డిజిటల్ మంత్రం..
మొదట స్కెచ్ వేసి తర్వాత దానిని డిజిటల్ చేయడం అంత ఈజీ కాదు. పెయింటింగ్స్‌కు డిజిటలైజేషన్‌కు అవినాభావ సంబంధం ఉంది. టెకీగా ఉంటూ హాబీగా డిజిటల్ చిత్రాలు చేస్తున్నాను. అఘోరా, దేవుళ్లు.. ఇలా నేను వేసిన చిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచాను.
- కిషోర్ ఘోష్
 
మోడర్‌‌న పెయింటింగ్ ఇష్టం..
మోడర్‌‌న పెయింటింగ్ ప్రత్యేకమైనది. వీటిని చాలా మంది ఇష్టపడతారు. నేను ఈ తరహా పెయింటింగ్స్‌పై దృష్టి పెట్టాను. డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించే ప్రతిబింబంపై అందరూ ఆసక్తి కనబరుస్తారు.
 - రీతు
 
ప్రొఫెషన్‌గా మారింది..

చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడంపై ఆసక్తి. దేవుళ్ల చిత్రాలు వేయడం చాలా ఇష్టం. ఒకప్పుడు హాబీగా ఉన్న పెయింటింగ్ ఇప్పుడు ప్రొఫెషన్‌గా మారింది. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే చిత్రకళకు మంచి రోజులు మళ్లీ మొదలయ్యాయి. తరచూ ఆర్ట్ ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి. ఇది శుభపరిణామం.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు