కాక్‌టైల్ డాట్‌కామ్

19 Sep, 2014 01:58 IST|Sakshi
కాక్‌టైల్ డాట్‌కామ్

 డ్రింకు డ్రింకరాదు, డ్రింకి డ్రైవరాదు
 డ్రింకు డ్రింకెనేని డోసు మించరాదు
 డోసు మించెనేని డేంజెరౌ దయతలచి
 వైనుతేయుని వర్డు వినుము ట్రూతు!
 
 మితిమీరితే మతి చెడుతుందో, మతి చెడితే ‘మితి’మీరుతుందో తెలియదు గానీ, రెండింటిలో ఏది జరిగినా అది అనర్థ హేతువే అవుతుంది. ‘మందు’మతులైన ‘డోసు’బాబులు మోతాదు చూసుకోకుండా, సీసాలో చివరి చుక్కనైనా వదలకుండా మతి‘తప్పతాగి’ వాహనంతో రోడ్డెక్కితే మూల్యం చెల్లించుకోక తప్పదు. అదృష్టం బాగుంటే, ఆ మూల్యం ట్రాఫిక్ పోలీసులకు చెల్లించే జరిమానాతో సరిపోతుంది. అలా కాకుంటే, ప్రాణాల మీదకొస్తుంది. ఇలాంటి విపత్తులు తలెత్తకుండా ఉండాలంటే, సేదదీరే తీరిక లేనప్పుడు ‘బుడ్డి’మంతులు డోసు మించరాదు. డ్రింకినప్పుడు ఆదరబాదరగా బండి డ్రైవరాదు. ‘మద్య’మావతి ఆలపించే ముందు పంకజ్ ఉధాస్ పాట ఆలకిస్తే చాలు- ‘థోడీ థోడీ పియా కరో..’ ఈ హితబోధను తలకెక్కించుకుంటే, కిక్కును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. బాధ్యతెరిగిన డోసు మీరని ‘బుడ్డి’మంతుల కోసం ఈ వారం...
 
 ‘మధు’రోక్తి
 నా నుంచి మధువు తీసుకున్న దానికంటే, మధువు నుంచి నేను తీసుకున్నదే ఎక్కువ
     - విన్‌స్టన్ చర్చిల్,
 బ్రిటన్ మాజీ ప్రధాని
 
 మిస్టిక్ మ్యూజిక్
 వోడ్కా    :    40 మి.లీ.
 టెకిలా    :    20 మి.లీ.
 ఐస్డ్ టీ    :    60 మి.లీ
 లెమనేడ్    : 60 మి.లీ.
 సోడా    :    80 మి.లీ.
 గార్నిష్    :    నారింజ తొన,    నిమ్మచెక్క
 -  వైన్‌తేయుడు

మరిన్ని వార్తలు