నిద్రలేమితో గుండెకు ముప్పు

27 Feb, 2018 15:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : రాత్రివేళ కంటి నిండా కునుకు లేకుంటే మరుసటి రోజంతా అలసట, నిరుత్సాహం ఆవహించడం సహజం. అయితే నిద్ర సమస్యలతో అంతకు మించి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే హృద్రోగాల ముప్పు పొంచిఉందని, నిద్ర మధ్యలో లేవడం..ముందుగానే మేలుకోవడం హార్ట్‌ అటాక్‌ ముప్పు రెండింతలు చేస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. దాదాపు 13,000 మంది నిద్ర అలవాట్లను పర్యవేక్షించిన అనంతరం జపనీస్‌ అథ్యయనం ఈ వివరాలు వెల్లడించింది.

నిద్రలేమి కార్డియోవాస్కు‍లర్‌ వ్యాధికి దారితీస్తుందని తమ అథ్యయనంలో వెల్లడైందని హిరోషిమా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్‌ నొబు ససాకి బార్సిలోనాలో జరిగిన యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ కాంగ్రెస్‌లో పేర్కొన్నారు. జీవనశైలి మార్పులు చేసుకోవడం, సమీకృత ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటి మార్పులతో ఒత్తిడిని తగ్గించుకుంటే రాత్రి నిద్ర మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా