కార్పొరేట్ లీడర్స్.. సైకిలింగ్‌

18 Jul, 2014 02:53 IST|Sakshi
కార్పొరేట్ లీడర్స్.. సైకిలింగ్‌

CEO RIDE:  బయట అడుగు పెట్టాలంటే కారు.. అడుగడుగునా రెడ్‌కార్పెట్ స్వాగతాలు... ఎండ కన్నెరుగని జీవితాలు. వందల వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే కంపెనీలకు సీఈఓలు. సైకిలింగ్‌కే సై అంటున్నారు. చమురు ధరలు పెరుగుతున్నాయనేమో అని భ్రమపడిపోకండి. వారు పైడిల్‌పై కాలెడుతున్నది సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు. నగరవాసులకు ఆరోగ్యంపై అవగాహను పెంచేందుకు.
 
 ఒక్కరు కాదు ఇద్దరు 200 మంది సీఈఓలు  45 నిమిషాల పాటు చేసే ఈ రేర్ సైకిల్ రైడ్‌కు నగరం వేదిక కాకనుంది. దీన్ని అట్లాంటా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కార్పొరేట్ లీడర్స్ ఇంత పెద్ద సంఖ్యలో ఒక ఈవెంట్‌లో పాల్గొనడం దేశంలోనే ప్రథమం కావడంతో ఈ ఈవెంట్‌కు క్రేజ్ ఏర్పడింది. హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్ దగ్గర ఉన్న వెస్టిన్ హోటల్ నుంచి ఈ రైడ్‌ను శనివారం ఉదయం ఐటి శాఖా మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. దేశంలోనే వినూత్నంగా రూపొందిన ‘రైడ్ ఫర్ లైఫ్’ మేగ్‌జైన్‌ను ఆవిష్కరిస్తారు. రాజసాన్ని వీడి రహదారుల బాట పట్టిన సీఈఓల సైక్లింగ్ రైడ్ సూపర్‌హిట్ కావాలని, మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.
  - ఎస్బీ
 

మరిన్ని వార్తలు