డాటా స్టోరింగ్, షేరింగ్‌కు ‘గూగుల్ డ్రైవ్’

27 Jun, 2013 03:33 IST|Sakshi
డాటా స్టోరింగ్, షేరింగ్‌కు ‘గూగుల్ డ్రైవ్’
కంప్యూటర్‌తో సహవాసాన్ని సౌకర్యవంతం చేయడమే లక్ష్యంగా ఉన్న సదుపాయాల్లో గూగుల్ ప్రోడక్ట్స్ ముఖ్యమైనవి. అలాంటి గూగుల్ ప్రోడక్ట్స్‌లో ఒకటి గూగుల్ డ్రైవ్. దాదాపు ఏడాది కిందట మొదలైన ఈ సర్వీస్‌ను ఇప్పుడు15 జీబీ స్థాయికి విస్తరించారు. కంప్యూటర్, ఐఫోన్, ఆండ్రాయిడ్‌లపై నడిచే ఈ క్లౌడ్ షేరింగ్ అప్లికేషన్ ద్వారా 15 జీబీ డాటాను దాచుకోవడానికి అవకాశం ఉంది. పీసీలో, స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద పరిమాణంలోని డాటాను స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇది చాలా సదుపాయంగా నిలుస్తుంది. 15 జీబీకి మించిన డాటా విషయంలో మాత్రం నెలవారీ చెల్లింపుల ద్వారా గూగుల్ డ్రైవ్‌ను వాడుకోవడానికి అవకాశం ఉంది. 
 
ఆన్‌లైన్ యాక్సెస్ ద్వారా ఈ డ్రైవ్‌ను మల్టిపుల్ యూజర్ ఎన్విరాన్‌మెంట్‌లో వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ ఓఎస్‌ఎక్స్, గూగుల్ క్రోమ్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లపై గూగుల్ డ్రైవ్‌ను రన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పీసీలో ఎక్స్‌టెన్షన్‌గా పనిచేస్తున్నప్పుడు... డివైజ్ దెబ్బతిన్నప్పటికీ గూగుల్ ్రైడె వ్‌లో స్టోరేజ్ సురక్షితంగా ఉంటుంది. ఇందులోకి అప్‌లోడ్ చేసే ఫైల్స్, క్రియేట్ చేసే ఫైల్స్ ప్రైవేట్‌గానే ఉంటాయి. వీటిని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారానే షేర్ చేయడానికి అవకాశం ఉంది. https://drive.google.com/mydrive నుంచి డ్రైవ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
స్కైడ్రైవ్...
 
గూగుల్ డ్రైవ్‌లో ఉండే ఉపయోగాలే స్కై డ్రైవ్‌లో కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌వారి ఈ సేవ ద్వారా 7 జీబీ వరకు డాటాను క్లౌడ్‌లో పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం, ఫైల్స్ క్రియేట్, షేరింగ్‌కు అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కోసం మరో 3జీబీ స్పేస్‌ను అదనంగా ప్రొవైడ్ చేస్తారు. ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ విండోస్, ఓఎస్ ఎక్స్‌లపై పనిచేస్తుంది.
మరిన్ని వార్తలు