‘దాన్నుంచి బయటపడలేదు’

5 Oct, 2017 20:30 IST|Sakshi

సాక్షి, ముంబయి: సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న దృశ్యకావ్యం పద్మావతిలో రాణీ పద్మినిగా మెరుస్తున్న దీపికా పడుకోన్‌ వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను కుంగుబాటుకు గురయ్యానని బోల్డ్‌గా చెప్పిన దీపిక తాజాగా తాను ఇప్పటికీ డిప్రెషన్‌ నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పలేనన్నారు. తనకు చేదు అనుభవాలు మిగిల్చిన డిప్రెషన్‌ గురించి తన మనసులో ఓ మూల దాని తాలూకు భయం దాగుంటుందని చెప్పారు.

కుంగుబాటు కారణంగా ఏమైనా సినిమాలను మీరు కోల్పోయారా అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ తాను డిప్రెషన్‌లో ఉన్నానని కొందరు తనకు సినిమా ఆఫర్లు ఇవ్వకపోయి ఉండవచ్చని చెప్పారు. అయితే తాను తనకు ఇష్టమైన మూవీలను ఎంపిక చేసుకునే స్థితిలో ఉన్నానన్నారు. మానసిక అస్వస్థతపై ప్రజల దృక్పథం మారాల్సి ఉందన్నారు. ఇక తాను మెచ్చే వ్యక్తిలో హాస్య చతురతతో పాటు మంచి ఎత్తు, సత్ర్పర్తన వంటి మూడు లక్షణాలుండాలని చెప్పుకొచ్చారు. సెలబ్రిటీల్లో తాను బ్రాడ్లీ కూపర్‌ను అమితంగా ఇష్టపడతానన్నారు. కాగా, రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌లతో కలిసి దీపిక నటించిన పద్మావతి డిసెంబర్‌ 1న విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు