మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం

30 Nov, 2014 22:49 IST|Sakshi
మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం

42 ఏళ్ల భూషణ్ ఎనిమిదేళ్లుగా తిన్నది సరిగా అరగక, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. మలబద్ధకం తీవ్ర స్థాయిలో బాధపెడుతున్నది. ఎవరికైనా ఏమని చెప్పుకొంటాడు..! అతను ఏ పని చేస్తున్నా అతని ఆలోచన మాత్రం ఈ సమస్యల చుట్టూనే తిరుగుతున్నది. అలాంటి పరిస్థితిలో తన అనారోగ్యాలను తీసేసే మంత్రదండం గురించి తెలిసిందతనికి. అదే కోలన్ హైడ్రో థెరపీ. వెంటనే మా దగ్గర మెడికల్ కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఈ కొత్త థెరపీ గురించి వివరంగా తెలుసుకున్నాడు.  తన సమస్యలన్నీ డాక్టర్‌కు తెలిపిన తరువాత 5 సిట్టింగ్‌ల ప్యాకేజీతో చికిత్స చేయించుకున్నాడు. భూషణ్ ఇప్పుడు శారీరకంగా, మానసికంగా నూతనోత్తేజంతో ఉల్లాసంగా ఉంటున్నాడు.
 
మంచి ఆహారం తీసుకోవడం, అది సక్రమంగా జీర్ణం కావడం, వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం... ఇవన్నీ సరైన రీతిలో జరిగితే 90 శాతం జబ్బులను నివారించవచ్చంటే అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆధునిక  జీవనశైలి  వీటిని పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా మలబద్ధకం లాంటివి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి.
 
మలబద్ధకం ఎందుకు..?
తగినన్ని నీళ్లు తాగకపోయినా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోయినా.. పేగుల్లో కదలికలు సరిపడినంత ఉండవు. అలాంటి సందర్భాల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. కొంతమంది పేగుల్లో కదలికలు కలిగి విసర్జించాల్సిన అవసరం ఉన్నప్పుడు విసర్జించకుండా పదే పదే ఆపుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు చేరే సంకేతాల తీరు మారుతుంది. అందువల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. స్మోకింగ్ ఇందుకు దారి తీస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పేగులలో కదలికలు లేకపోతే మలబద్ధకం అని భావించవచ్చంటున్నారు మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ప్రసాద్.
 
కోలన్ హైడ్రోథెరపీ
మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలకు పేగులు శుభ్రపడి వాటి కదలికలు సాఫీగా ఉండటమే పరిష్కారం. ఇందుకోసం కోలన్ హైడ్రోథెరపీ మేలు చేస్తుందంటున్నారు శుద్ధ్ కోలన్ డెరైక్టర్ రాజగోపాల్. స్వచ్ఛమైన గోరువెచ్చని నీటిని మలద్వారం ద్వారా పెద్ద పేగు లోపలికి పంపించి అక్కడ పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తారు. ఆ నీరు పెద్ద పేగు మొత్తాన్ని పూర్తిగా కడిగివేస్తూ బయటకి వచ్చేస్తుంది. దీంతో శరీరంలో మిగిలి ఉన్న మాలి న్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ నీటిని పంపించడం కోసం ప్రతి పేషెంట్‌కి డిస్పోజబుల్ నాజిల్స్ వాడతారు కాబట్టి నాజిల్ కలుషితమయ్యే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ‘సమస్య తీవ్రంగా ఉన్నవారికి దీన్ని ప్యాకేజీ చికిత్సగా కూడా ఇస్తారు. పూర్తి ప్యాకేజీ చికిత్స తీసుకుంటున్న వారు మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ప్యాకేజీ మొత్తంలో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. ఈ ప్యాకేజీ నెలలో పూర్తి చేయబడుతుంది. అని వివరించారు శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ రాజగోపాల్. ఈ ప్యాకే జీ పూర్తి అయ్యే నాటికి శరీరంలోని అన్ని వ్యవస్థలూ గాడిన
 పడతాయి.
 
ఇవీ ప్రయోజనాలు
- గ్యాస్ సమస్యల పరిష్కారం
- మలబద్ధకం నుంచి ఉపశమనం
- ఒత్తిడి నుంచి విముక్తి
- జీర్ణక్రియ మెరుగవుతుంది
- పెద్దపేగులో కదలికలు మెరుగవుతాయి
 
వీరికి పనికిరాదు
గర్భవతులు, పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అల్సరేటివ్ కొలిటీస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి కోలన్ హైడ్రో థెరపీ పనికిరాదు.

>
మరిన్ని వార్తలు