పిల్లలకు బహుమతిగా ఇచ్చేవి అవేనా..?

14 Nov, 2017 14:22 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రమాదకరంగా మారిన కాలుష్యంపై జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్రంగా స్పందించింది. పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డ ఊపిరితిత్తులను బహుమతిగా ఇస్తారా అని ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. వాయుకాలుష్యం తీవ్రమై పీఎం 2.5, పీఎం 10 స్ధాయిలు ఆందోళనకరంగా ఉన్న క్రమంలో అత్యవసర చర్యలు చేపట్టాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ను ఆదేశించింది. ఢిల్లీ నగరంతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో గత వారం కాలుష్య స్ధాయిలు అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

పరిస్థితి తీవ్రంగా ఉన్నా వాయు కాలుష్యాన్ని అరికట్టే సమర్ధవంతమైన చర్యలను ప్రభుత్వం ఇంతవరకూ చేపట్టలేదని పర్యావరణ నిపుణులు ఆరోపిస్తున్నారు. సరి బేసి పద్ధతి నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించాలన్న రివ్యూ పిటిషన్‌ విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ సర్కార్‌పై ఎన్‌జీటీ మండిపడింది.

పొగమంచుతో పాటు విపరీతమైన కాలుష్యం ముంచెత్తడంతో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల పాఠశాలలకు సెలవు ఇచ్చింది. ఇక మూతపడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకోవడంతో మాస్క్‌లు ధరించి చిన్నారులు పాఠశాలలకు వెళుతున్నారు.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శరీరం లేకపోతేనేం...

వేడి వృథా కాకుండా.. కరెంటు..!

రహస్య మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా..

బస్‌లో మహిళ డ్యాన్స్‌ : సిబ్బందిపై వేటు

ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌