15న డచ్ గిటారిస్ట్ వాన్ హీస్ రాక

12 Oct, 2014 23:43 IST|Sakshi
15న డచ్ గిటారిస్ట్ వాన్ హీస్ రాక

హెచ్‌డబ్ల్యూఎంఎఫ్ ఐదో వార్షికోత్సవాలు..

హైద్రాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్ (హెచ్‌డబ్లుంఎఫ్) ఐదవ వార్షికోత్సవాలలో పాల్గొనేందుకు ‘అథీనియం ఛాంబర్ ఆఫ్ ఆర్కెస్ట్రా’ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత డచ్ గిటారిస్ట్ మార్టిన్ హీస్ నగరానికి విచ్చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ నగరంలో  వివిధ  కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పబ్లిక్ పర్‌ఫార్మెన్స్‌లు
బుధవారం సాయంత్రం 7 గంటలకు అన్నపూర్ణ స్టూడియో లైన్‌లోని ప్లాంటేషన్ స్టుడియో హౌస్‌లో
శనివారం (18వ తేదీ) సాయంత్రం 7 గంటలకు హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సంగీత కచేరీ ఇస్తారు.

వర్క్‌షాప్‌లు
శుక్రవారం సాయంత్రం (17వ తేదీ) 6-30 నుంచి 8-30 గంటల వరకూ బేగంపేటలోని పాత ఎయిర్‌పోర్ట్ సమీపంలోని యమహా మ్యూజిక్ స్వ్యేర్‌లో ఆదివారం (19వ తేదీ) ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని లామకాన్‌లో సంగీత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా సలహాలు, శిక్షణ తీసుకోవాలనుకునే వారికీ అందుబాటులో (info@hydmusic.com mailto:info@hydmusic.com 9912201659  
9849451794 ) ఉంటారు.

మరిన్ని వార్తలు