ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్

30 Dec, 2015 15:05 IST|Sakshi
ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్

ఇంటర్నేషనల్ రుచులు మాత్రమే కాదు గ్లోబల్ డైనింగ్ స్టైల్స్ సైతం ఇప్పుడు సిటీలో ఒక అవసరంగా మారాయి. విదేశాల నుంచి రాకపోకలు బాగా పెరగడం వల్ల వచ్చిన ఈ అవసరం నేపథ్యంలో మాదాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని సి-గస్తా రెస్టారెంట్ సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌ను పరిచయం చేస్తోంది. ‘ఇంగ్లిష్ బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో ఈ రెస్టారెంట్ శనివారం ప్రారంభించిన మెనూలో... మొత్తం 15 నుంచి 20 రకాల వెరైటీలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. యూరోపియన్ శైలిని తలపిస్తూ కుస్‌కుస్ ఉప్మా, కోల్డ్‌కట్స్ వంటి డిఫరెంట్ ఐటెమ్స్‌తో పాటుగా ఎగ్‌తో చేసిన 10 రకాల వంటకాలు, హోమ్ మేడ్ చికెన్ సాసెస్, బ్రెడ్స్, జామ్స్ వంటివన్నీ అందిస్తున్నామన్నారు.
 - సిటీ ప్లస్

మరిన్ని వార్తలు