ఎట్‌లాస్ట్ మ్యారీడ్!

6 Feb, 2015 00:15 IST|Sakshi
ఎట్‌లాస్ట్ మ్యారీడ్!

ఎన్నాళ్లకెన్నాళ్లకు..! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ నటులు జానీ డెప్, అంబర్ హెర్డ్‌లు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కేశారు. యాభై ఒక్క ఏళ్ల డెప్... ఇరవై ఎనిమిదేళ్ల అంబర్ మూడేళ్ల కిందట ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అప్పటి నుంచి వారి పెళ్లి కోసం ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నారు సన్నిహితులు, అభిమానులు.

ఇన్నాళ్లకు ఆ ఘడియ రానే వచ్చింది. డెప్ ఇంటి వద్దే గప్‌చుప్‌గా ఈ తంతు జరిగిపోయిందని అతడి సన్నిహిత వర్గాల సమాచారం. అయితే వారాంతంలో పెళ్లి పార్టీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. అది కూడా బహమాస్‌లోని డెప్ ప్రైవేట్ ఐలాండ్‌లో! వెనెసా పరాడిస్‌తో లాంగ్‌టైమ్ రిలేషన్ కట్ చేసుకున్నాక అంబర్‌కు దగ్గరయ్యాడు డెప్!
 

మరిన్ని వార్తలు