కండ బలం కష్టం కాదు...

29 Oct, 2014 00:54 IST|Sakshi
కండ బలం కష్టం కాదు...

ఫిట్‌నెస్‌కి సింబల్‌గా కనిపించే ప్యాక్ అంటే క్రేజ్ పెరుగుతూనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్ మరోసారి తన ఫిజిక్‌తో ఫ్యాన్స్‌ని ప్యాక్ చేసేశాడు. దీంతో ‘సిటీయూత్‌లో ‘సిక్స్’ ఫీవర్ ఒక్కసారిగా రెండింతలైంది. అయితే ఆరుపలకల అపు‘రూపం’సినిమా, సెలబ్రిటీలకు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా సిక్సర్ కొడుతున్నారు. అది చాలా సులభమని కొందరు అనుకుంటుంటే.. ఇప్పటికీ అత్యంత కఠినమైన ప్రయాసని మరికొందరు భావిస్తున్నారు.  నగరానికి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్ ఏమంటున్నారంటే...
 
 ఆరు పలకలు అందరికీ...
 సిక్స్‌ప్యాక్ అంటే కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకురావు. ప్రతి మనిషి శరీరంలో  సహజంగానే ఉండే మజిల్స్. అయితే వంశపారంపర్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాలు, బోన్స్ వగైరాల లాగానే ఫ్యాట్‌తో అవి కూడా కవర్ అయిపోతాయి. అలా అట్టడుగున్న ఉన్న వాటిని హార్డ్ వర్క్‌వుట్స్, ఎక్సర్‌సైజ్‌ల ద్వారా వెలుగులోకి తీసుకురావడ ం జరుగుతుంది. ఇవి కొందరికే సాధ్యం మరికొందరికి అసాధ్యం అనేది అపోహ మాత్రమే. వ్యక్తి శరీరపు తీరుతెన్నులపై ఆధారపడి  4 నుంచి 8(ఎయిట్‌ప్యాక్) దాకా పలకలను బిల్డప్ చేయవచ్చు. వ్యక్తి దేహం తీరుని బట్టి ఈ కండరాలు వెల్లడవడానికి 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా సమయం తీసుకుంటాయి. ఆత్రపడి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడడం ప్రమాదకరం.
 
 డైట్ ఇంపార్టెంట్..
 ఈ సిక్స్‌ప్యాక్‌కి గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైనది స్ట్రిక్ట్ డైట్. ఫ్యాట్ స్టమక్‌ని సాధించే క్రమంలో ట్రైనర్ సూచించిన డైట్‌ని తప్పనిసరిగా టైమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. వీటిని సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే. కొన్ని రోజులపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చాలు  మాయమైపోతాయి. ఎగ్‌వైట్స్, ఫ్రూట్స్, గ్రిల్డ్ చికెన్... ఇలా ప్రొటీన్‌ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఫుడ్ ద్వారా సరిపోకపోతే అవసరాన్ని బట్టి ప్రొటీన్‌షేక్స్, ఎనర్జీడ్రింక్స్ వినియోగించవచ్చు.
 
 సిస్టమాటిక్... వర్కవుట్...
 క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. లక్ష్యం సిక్స్‌ప్యాక్ అయినప్పటికీ ఫిజిక్‌ని ఓవరాల్‌గా బిల్డప్ చేయడం మీద కాన్సన్‌ట్రేట్ చేయాలి. దీనిలో భాగంగా రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్... వంటివి తప్పనిసరిగా భాగం కావాలి. ఒకేసారి కాకుండా వ్యాయామ సమయాన్ని విడతలవారీగా పెంచుకుంటూ రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు చేయాల్సి ఉంటుంది.  పొట్టకండరాలైన యాబ్స్‌కి ఎక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి... అబ్డామినల్ ఎక్సర్‌సైజ్‌లు శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి ఎందుకంటే చేసేవిధానంలో లోపాలుంటే మరిన్ని రకాల శారీరకసమస్యలకది కారణం కావచ్చు.
  - ఎస్.సత్యబాబు

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేడి వృథా కాకుండా.. కరెంటు..!

రహస్య మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా..

బస్‌లో మహిళ డ్యాన్స్‌ : సిబ్బందిపై వేటు

ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...

తెలివిటీగలు..ప్రైజ్‌ మనీ రూ. 35 లక్షలు..!

లాలిజో.. లాలీజో...

అమ్మకు అర్థం కావట్లేదు

నీటిలోపల రెస్టారెంట్‌..డిన్నర్‌ ఖరీదు ఎంతంటే..

ఎగిరే మోటర్‌బైక్‌..  ద స్పీడర్‌!

కన్యాదానం ఏంటీ?

రౌండప్‌ 2018,2019 

పుడితే కదా బతికేది

మారుతున్న మగతరం

వికసించని బాల్యానికి  విహంగాల నైపుణ్యం!

బ్రెయిన్‌ డైట్‌ 

విషవాయువుకు కొత్త ఉపయోగం

బాల్యం పెరుగుతోంది

క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!

లక్ష కోట్ల మొక్కలతో భూతాపోన్నతికి చెక్‌! 

షీ ఇన్‌స్పెక్టర్‌

అలల ఫ్యాక్టరీతో విద్యుత్‌ ఉత్పత్తి...

మాస్టర్‌ స్విచ్‌ను  కనుక్కున్నారా?

ఆమెకు కులం, మతం లేదు!

ఐరన్‌ లేడీ

భర్త రాసిన ప్రిస్క్రిప్షన్‌

ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టే..

ఆయన గ్యారేజ్‌లో ఆరు రోల్స్‌ రాయిస్‌ కార్లు..

ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!

రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్‌

అయస్కాంతాలతో  కండరాలకు శక్తి...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌