కింగ్స్ ఆఫ్ స్పీడ్ నైట్

7 Oct, 2014 01:07 IST|Sakshi
కింగ్స్ ఆఫ్ స్పీడ్ నైట్

యూకేకు చెందిన ఫ్యూచరిస్టిక్ పొలార్ బేర్స్, డీజే అక్బర్ సమీ ట్యూన్ల సందడిలో హైదరాబాదీలు మునిగితేలారు. బేగంపేటలోని బాటిల్స్ అండ్ చిమ్నీస్‌లో ఆదివారం రాత్రి జరిగిన కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ ‘కింగ్స్ ఆఫ్ స్పీడ్’ నైట్స్‌లో వీరి పాటలు, మ్యూజిక్‌కు సిటీవాసులు స్టెప్పులేశారు. స్పీడ్ రేసింగ్, ఫన్, ట్రివియా గేమ్స్‌తో తెగ ఎంజాయ్ చేశారు. టీవీ నటి శ్వేతసాల్వే ప్రజెన్స్ అదనపు ఉత్సాహాన్నిచ్చింది. సిమ్యులేటర్ గేమ్‌లో విజేతగా నిలిచిన వారికి బ్రిటన్‌లోని సిల్వర్ స్టోన్ రేసింగ్ అకాడమీని సందర్శించే అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.               
  - సాక్షి, సిటీప్లస్

మరిన్ని వార్తలు