గూగుల్ మై బుల్‌బుల్

8 Jul, 2014 08:03 IST|Sakshi
గూగుల్ మై బుల్‌బుల్

గూగుల్... గురువులకే గురువులాంటిది..
నూడుల్స్ నుంచి న్యూక్లియర్ రియాక్టర్ వరకు...
షేర్‌మార్కెట్ నుంచి శేర్‌లింగంపల్లి అడ్రస్ వరకు ...
దేని గురించి తెలుసుకోవాలన్నా...  మన మునివేళ్లు గూగుల్‌నే టైప్ చేస్తాయి.. గూగుల్ లేని కంప్యూటర్.. దేవుడి లేని గుడిలాంటిదంటే అతిశయోక్తి కాదేమో.. అందుకే ఆ గూగులమ్మకు పాటతో
పట్టాభిషేకం చేశారు నెటిజన్లు... ఇంగ్లిష్ పదాలను శాస్త్రీయ సంగీతంలో కూర్చి... టెడ్డీబేర్‌తో గాత్రదానం చేయించారు..
గూగుల్‌పై తమకున్న గురుభక్తిని ఆన్‌లైన్ సాక్షిగా చాటిచెప్పారు.
ఆ పాట వింటే మీ పొట్టచెక్కలవ్వాల్సిందే..
మనసు పులకించాల్సిందే.. చివరికి అవును నిజమే కదూ
అంటూ తలూపాల్సిందే... ఆన్‌లైన్‌లో ఫన్నీ వీడియోతో అదరగొట్టే ఫన్‌జోవా.కామ్ దీన్ని క్రియేట్ చేసింది. మీరూ ఈ గూగుల్ సాంగ్ చూడాలంటే ఫన్‌జోవా.కామ్‌లో లేదా యూట్యూబ్‌లో ‘గూగుల్ మై బుల్‌బుల్’ అని టైప్ చేసి చూడొచ్చు.  కడుపుబ్బా నవ్వించే ఆ పాట లిరిక్స్ ఇలా ఉంటాయి..
గూగుల్ గూగుల్... మై బుల్‌బుల్..బుల్ బుల్
ఇటీస్ సో యూస్‌ఫుల్... వేరీ కూల్..
వెన్ ఐ హావ్ క్వశ్చన్...
ఐ సెర్చ్ ఇన్ ద హోమ్ పేజ్
ఇట్ విల్ ఆన్సర్, వేరీ రియల్
-ప్రవీణ్‌కుమార్ కాసం

మరిన్ని వార్తలు