గౌహర్ ఇంటెన్షన్!

6 Jan, 2015 02:57 IST|Sakshi
గౌహర్ ఇంటెన్షన్!

సినిమాల్లోనే చూస్తుంటాం... విలన్ పాపులారిటీ, సింపతీ తెచ్చుకోవడానికి తనపై తనే దాడి చేయించుకుంటాడు. సరిగ్గా అదే ఫార్ములా ఫాలో అయినట్టుంది హీరోయిన్ గౌహర్‌ఖాన్. రియాల్టీ షో ‘ఇండియాస్ రా స్టార్’ షూటింగ్‌లో కురచ డ్రెస్ వేసుకుందంటూ జూనియర్ ఆర్టిస్ట్ మహమ్మద్ అకిల్ మాలిక్ గౌహర్ చెంప ఛెళ్లుమనిపించాడు. సింపతీ పెరిగి... ఒక్కసారిగా ఈ అమ్మడికి పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడా ఎపిసోడ్ ఆసక్తికర మలుపు తీసుకుంది. తనను కొట్టమని గౌహరే డబ్బులిచ్చిందని మాలిక్ చెబుతున్నాడు. ఈ మేరకు ఇద్దరి మధ్యా మౌఖిక ఒప్పందం కుదిరిందట. ‘నాకు అవకాశాలిమ్మని గౌహర్‌ను కలిశా. దబాంగ్3లో మంచి రోల్ ఇప్పిస్తానని, ప్రతిగా రియాల్టీ షోలో తనను కొట్టాలని కోరింది’ అంటూ ఓ చానల్‌తో గుట్టు విప్పాడు మాలిక్.
 

మరిన్ని వార్తలు