వావ్.. డూడుల్

6 Feb, 2015 00:30 IST|Sakshi
వావ్.. డూడుల్

డూడుల్... గూగుల్ సెలబ్రేషన్ విత్ ఫన్. అది ఏ దేశం పండుగైనా కావచ్చు గూగుల్ తన లోగోతో ఆ వేడుకల్లో పాలుపంచుకుంటుంది. ప్రముఖ ఆర్టిస్టులు, మార్గదర్శకులు, శాస్త్రవేత్తల జయంతి కావచ్చు...  లోగోతో వారికి నివాళి అర్పిస్తుంది. యానివర్సరీలను సెలబ్రేట్ చేస్తుంది. ఈరోజు ‘నేషనల్ డూడుల్స్ డే’ సందర్భంగా డూడుల్ ఆవిర్భావం, ప్రస్థానం గురించి...
 
మొదలైందిలా...

గూగుల్ వ్యవస్థపాకులైన లారీ, సెర్జీలకు 1998లో ఈ డూడుల్ ఆలోచన పుట్టింది. సాన్ ఫ్రాన్సిస్కో పండుగ అయిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ రోజు గూగుల్‌లోని రెండో ‘ఓ’ వెనుకగా ఆ ఫెస్టివల్ సింబల్‌ను చేర్చారు. అలా సృష్టించిన లోగో అందరినీ ఆకట్టుకుంది. రెండు సంవత్సరాల తరువాత బాస్టిల్ డే (ఫ్రాన్స్ నేషనల్ డే)రోజున వెబ్ మాస్టర్ డెనిస్ హాంగ్‌తో మరో డూడుల్‌ను తయారు చేయించారు. గూగుల్ యూజర్స్‌నుంచి మంచి స్పందన వచ్చింది. వెంటనే డెనిస్ హాంగ్ చీఫ్ డూడ్లర్‌గా డూడుల్స్ టీమ్‌ని నియమించింది గూగుల్. ఆరోజునుంచి రెగ్యులర్‌గా డూడుల్స్ మొదలుపెట్టారు. తరువాత కాలంలో ఒక్క యూఎస్‌లోనే కాదు... అంతర్జాతీయంగా ఈ డూడుల్స్‌కి డిమాండ్ పెరిగింది.
 
మేథోమదనం...

ఇప్పుడు డూడుల్స్ రూపొందించడానికి క్రియేటివ్ టీమ్ ఉంది. ఈ టీమ్ ఇప్పటివరకు 2000 డూడుల్స్‌ను తయారు చేసింది. గూగుల్ టీమ్ తరచూ కూర్చుని ఏయే డూడుల్స్ తయారు చేయాలనే అంశంపై మేథోమదనం చేస్తుంది. వచ్చిన ఆలోచనలకు డూడుల్స్ రూపం ఇచ్చేందుకు గూగుల్ ఎంప్లాయిస్ నుంచే కాదు... యూజర్స్ నుంచి కూడా ఆహ్వానిస్తుంది. వచ్చిన వాటినుంచి గూగుల్‌ను ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకునే డూడుల్స్‌ను ఎంపిక చేస్తుంది.
 
యూజర్స్ పంపడమెలా?

యూజర్స్‌నుంచి ఐడియాస్ తీసుకోవడానికి గూగుల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. డూడుల్ టీమ్‌కు కొన్ని వందల రిక్వెస్ట్స్ వస్తుంటాయి. మీరూ మీకు వచ్చిన ఆలోచనలను గీసి proposals@google.com కు ఈ-మెయిల్ చేయవచ్చు.
 
ఇండియన్ డూడుల్స్...  

ప్రతి ఏటా మన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజులను ఇండికేట్ చేస్తూ డూడుల్స్‌ను తయారు చేస్తుంది గూగుల్. మొన్న జరిగిన ఘనతంత్ర వేడుకల సందర్భంగా శకటంలా తయారు చే సిన డూడుల్ భారతీయులను అమితంగా ఆకర్షించింది.ఇక మన చిల్డ్రన్స్ డేతో పాటు ప్రముఖ యానివర్సరీలనూ సెలబ్రేట్ చేస్తోంది డూడుల్. కట్టా కవిత
 

మరిన్ని వార్తలు